కొబ్బరినూనె ఆరోగ్యంతో పాటు అందంపై చేసేను అద్భుతాలు.. తెలుసుకోండి!

మన ఆరోగ్యానికి, అందానికి దోహదం చేసే వాటిలో కొబ్బరినూనె ఒకటి. కొబ్బతి నూనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, సౌందర్య రహస్యాలు ఉన్నాయి. ప్రతి ఒకరి ఇంట్లోను కచ్చితంగా ఉండే కొబ్బరి నూనె చాలా అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తుంది. కొబ్బరినూనె మనుషుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రకృతి ప్రసాదించిన వరమని చెప్పాలి. మనకు వృద్ధాప్యపు చాయల నుండి కాపాడి యవ్వనంగా ఉంచటంలో కూడా కొబ్బరి నూనెది కీలక భూమిక.

కొబ్బరి నూనెతో ఫుల్ ఆరోగ్యం
కొబ్బరినూనె శరీరంలో వాపులు, నొప్పులు తగ్గడానికి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి, ఊబకాయం బాధితులకు దివ్య ఔషధంగా పని చేస్తుంది.ప్రతిరోజు ఉదయం పూట రెండు స్పూన్ల కొబ్బరి నూనె తాగితే అనేక అనారోగ్య సమస్యలు మటుమాయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ రాత్రి కొబ్బరి నూనెను ఫేస్ కు మసాజ్ చేసుకుని ఉదయాన్నే ఫేస్ వాష్ తో కడిగితే ముఖం గ్లో వస్తుందని చెప్తున్నారు.

Coconut oil does wonders for health and beauty Know the benefits

వంటలో కొబ్బరి నూనె.. కొలెస్ట్రాల్ కు చెక్
ఒక స్పూన్ కొబ్బరి నూనెను మనం వండుకునే అన్నంలో వేసి వండుకున్నట్లయితే కొబ్బరి నూనెలో ఉండే మంచి కొవ్వు పదార్థాలు మనం అన్నం తిన్న సమయంలో మన ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. మన ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలను కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి వంట చేసుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. శరీర బరువు తగ్గించడంలో కొబ్బరి నూనె ఎంతగానో దోహదం చేస్తుందని చెబుతున్నారు.

కొబ్బతి నూనెతో నొప్పులు, వాపులకు చెక్
ఇక కొబ్బరి నూనెను కొద్దిగా వేడిచేసి వాపులు, నొప్పులు ఉన్నచోట రాసి మర్దన చేసినట్లయితే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు. కొబ్బరి నూనె తలకి రాసుకుని మర్దన చేసుకోవడం వల్ల శరీర హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుందని, మానసిక ఇబ్బందులు తగ్గి ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా పెరగటంలో కూడా కొబ్బరినూనె ఉపయోగపడుతుంది.

చర్మ సౌందర్యానికి కొబ్బరినూనె
కొబ్బరి నూనె చర్మ సౌందర్యానికి మేలు చేస్తుందని, కొబ్బరి నూనె పెదాలకు లిప్ బామ్ లాగా పనిచేస్తుందని, కొబ్బరి నూనె కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. కొబ్బరి నూనె ను ఏ విధంగా చర్మంపై ఉపయోగించినా ప్రయోజనం మాత్రం అద్భుతంగా ఉంటుంది. మంచి మాయిశ్చరైజర్ లా కొబ్బరి నూనె పని చేస్తుంది. యవ్వనంగా ఉంచి ముఖంపై ముడతలను నివారిస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+