పాలు ఎక్కువగా తాగుతున్నారా?
పాలు సంపూర్ణ ఆహారం. ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఒక గ్లాసు పాలు తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అందుకే వైద్యులు, పోషకాహార నిపుణులు ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగాలని సూచిస్తుంటారు. రాత్రివేళ నిద్రించే ముందు ఓ గ్లాస్ పాలు తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంది.
పాలలో అధిక శాతంలో ఉండే అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్ధాలు పిల్లల శారీరక ఎదుగుదలకు తోడ్పడటమే కాకుండా ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషయం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని కొంతమంది ఎక్కువగా తాగుతూ ఉంటారు. అతిగా పాలు తీసుకోవడంవల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ప్రతిరోజూ 3 కప్పుల తాజా, కల్తీ లేని, రసాయన రహిత పాలను తీసుకోవాలి. రోజూ మూడు కప్పుల కంటే ఎక్కువ పాలు తాగితే.. పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్ది. దీనివల్ల త్వరగా అలసిపోతారు. పాలలో ఉండే ఎ1 కేసైన్ కారణంగా ఇది జరుగుతుంది. ఎ1 కేసైన్ గట్ లైనింగ్ పారగమ్యతను పెంచడంతోపాటు పేగు ఎపిథీలియంపై ఇన్ఫ్లమేటరీ గుణాలను చూపిస్తుంది.
పాలు ఎక్కువగా తీసుకోవడంవల్ల జీర్ణ సమస్యలు ప్రారంభమవుతాయి. తమ్మిరి, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటివి ఇబ్బంది పెడతాయి. అంతేకాదు.. అలెర్జీలు, మొటిమలు వంటి చర్మ సమస్యలకు దారి తీస్తుంది. ఎరుపు రంగులో పగుళ్లు, దద్దుర్ల ఉన్నట్లైతే పాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తు. ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యాడ్ చేస్తే.. ఈ లక్షణాలు ఇంకా తీవ్రమవుతాయి. సాధ్యమైనంతవరకు సహజమైన పాలనే తీసుకోవాలి. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అంతేకాదు ఏకాగ్రత్త తగ్గుతుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి గ్రోత్ హార్మోన్లను వాడుతుంటారు. వీటిని తాగడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యతకు అంతరాయం కలుగుతుంది.












Click it and Unblock the Notifications