పెరుగుతో బరువుకు చెక్... ఇంకా బోలెడు అద్భుత ప్రయోజనాలు!
చాలామంది విపరీతమైన బరువుతో బాధపడుతూ బరువు తగ్గడం కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు. అంటే బరువు తగ్గి నాజూకుగా మారాలి అనుకుంటే కొన్ని ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. మీకు అటువంటి ఆహారాలలో పెరుగు ఒకటి. పెరుగుతో బరువు తగ్గటం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి పెరుగుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం .
పెరుగు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
సీజన్ ఏదైనా సరే ప్రతీ ఒక్కరూ పెరుగు తీసుకుంటే మనకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి .రోజువారి ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవడం ఎంతో మంచిది.. పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం , విటమిన్లు ఉంటాయి. పెరుగు మన శరీరంలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తుంది. గట్ హెల్త్ ను పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.

పెరుగుతో ఈ అనారోగ్యాల నుండి రక్షణ
ప్రతిరోజు మనం పెరుగు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రోబయోటిక్ అనేక అనారోగ్య సమస్యలను అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు పెరుగు తినడం వల్ల కొంతమేర ఒక ఉపశమనం పొందుతారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, రక్త సరఫరాను సమన్వయం చేస్తాయి. పెరుగు తినటం వలన గుండె జబ్బుల ప్రమాదం నుండి రక్షణ పొందుతారు.
పెరుగులో నల్లమిరియాల పొడి కలిపి తీసుకుంటే బెనిఫిట్
పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది . ఇక పెరుగులో నల్ల మిరియాల పొడిని కలుపుకుని తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. అలెర్జీలు, అధిక రక్తపోటు, ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నవారు నల్ల మిరియాల జోలికి పోకుండా ఉంటేనే మంచిది.
బరువు తగ్గేందుకు పెరుగు బెస్ట్
పెరుగులో ప్రో బయోటిక్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనిని నల్ల మిరియాల పొడితో కలిపి తింటే బరువు తగ్గటానికి వీలు అవుతుంది. శరీరాకృతి కోసం వ్యాయామాలు చేసే వారు కూడా పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే సన్నగా నాజూగ్గా మారే అవకాశం ఉంది.పెరుగు ఆహారంలో భాగంగా చేసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక చర్మ ఆరోగ్యానికి, కేశాల ఆరోగ్యానికి కూడా పెరుగు దోహదం చేస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications