కరివేపాకు హెయిర్ స్ప్రే.. ఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతుంది..!
ప్రస్తుతం జుట్టు రాలడం అనే సమస్య అందరినీ వేధిస్తోంది. ఆడ, మగ అని తేడా లేకుండా ఈ సమస్యను అందరూ ఫేస్ చేస్తున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి ఇలా అనేక కారణాల వల్ల జుట్టు రాలడం, లేదా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం సమస్య అనేకమందిని వేధిస్తోంది. అయితే ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం అనేక రకాల షాంపోలు, ఇతర హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు. అయితే పలు కారణాల వల్ల ఈ సమస్య తగ్గకపోగా అధికమవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ సమస్యకు వంటింట్లోనే బెస్ట్ చిట్కా ఉందని మీలో చాలా మందికి తెలియదు. మనం రోజూ వాడే పదార్థాలతోనే ఈ జుట్టు రాలుట సమస్యకు బెస్ట్ రెమెడీని తయారు చేసుకోవచ్చు.
ప్రతి ఇంట్లో సులభంగా లభ్యం అయ్యే కరివేపాకుతో ఈ సూపర్ మెడిసిన్ ను తయారు చేసుకోవచ్చు. కరివేపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కరివేపాకు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. కరివేపాకును వాడటం వల్ల జుట్టును నల్లగా, మందంగా మారుతుంది. అంతేకాక జుట్టును ఒత్తుగా చేయడానికి కరివేపాకు ఎంతో సాయపడుతుంది. కరివేపాకులోని విటమీన్ సీ, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిండెంట్స్ అలాగే అమైనో యాసిడ్స్ కారణంగా జుట్టు రాలిపోవడం ఆగడమే కాకుండా.. జుట్టు మళ్లీ మందంగా, బలంగా మారుతుంది. మరి కరివేపాకుతో ఈ హెయిర్ స్ప్రే ను ఎలా తయారు చేసుకోవాలి..? కరివేపాకుతోపాటు ఇంకా ఏఏ పదార్థాలు కావాలి..? కరివేపాకు హెయిర్ స్ప్రే తయారీ విధానం ఏంటి..?

కరివేపాకు నూనె తయారీకి ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలు, అర కప్పు కొబ్బరి నూనె తీసుకోవాలి. కొబ్బరి నూనెను ఓగిన్నెలో పోసి వేడి చేయాలి. ఆ తర్వాత దానిలో కరివేపాకు వేసుకోవాలి. అలా ఆకులు నల్లగా మారేంతవరకూ ఈ నూనెను తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని నూనెను చల్లబరచాలి. ఇప్పుడు ఆ నూనెను వడకట్టుకోవాలి. ఆ స్వచ్ఛమైన కరివేపాకు నూనెను గాలి దూరని ఓ గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇక ఈ నూనెతో వారానికి 2-3 సార్లు తలకు మసాజ్ చేసుకోవాలి. అలా ఒక 1 గంటపాటు పెట్టుకుని ఆ తర్వాత కడిగేసుకోవాలి.












Click it and Unblock the Notifications