డబ్బు సంపాదన తర్వాత.. శరీరం చేసే ఈ హెచ్చరికలు పట్టించుకోండి!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ తర్వాత డబ్బు ఖర్చు చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. చాలామంది సంపాదన పిచ్చిలో పడి సమయానికి తినకుండా, సమయానికి నిద్రపోకుండా, విపరీతమైన ఒత్తిడితో కూడిన జీవితాన్ని అనుభవిస్తూ రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.

డయాబెటిస్ ను, బిపిని నిర్లక్ష్యం చేస్తే జరిగేదిదే
అటువంటి వ్యాధులలో డయాబెటిస్, హై బీపీ ముఖ్యమైనవి. దీర్ఘకాలిక వ్యాధులుగా చెప్పే ఈ వ్యాధులు ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. డయాబెటిస్ ను, బిపిని నిర్లక్ష్యం చేస్తే అది మన శరీరంలో మరిన్ని కొత్త రోగాలకు కారణమవుతాయి. ఎవరైతే డయాబెటిస్ తో, హైబీపీ తో బాధపడుతున్నారో వారికి వారి శరీరం హెచ్చరిక జారీ చేసినట్టు..

diabetes and high bp don t ignore these warnings from your body in money earning busy

శరీరం చేసే హెచ్చరిక డయాబెటిస్, హైబీపీ
ఇకనైనా మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి అని శరీరం ఇచ్చే హెచ్చరికనే డయాబెటిస్, హైబీపీ. ఆ హెచ్చరికను కూడా పట్టించుకోకుండా ఆహారపు అలవాట్ల విషయంలోనూ, జీవనశైలి విషయంలోనూ పాత పద్ధతిలోనే ఉంటే కచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో మంచాన పడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన శరీరం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుంది అని తెలిసిన తర్వాత, వాటి నుండి కాపాడుకోవడానికి, ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతిఒకరు ప్రయత్నం చేయాలి.

ఇలా చేస్తే అవి కంట్రోల్.. లేదంటే కష్టం
అందులో ప్రతిరోజు వ్యాయామం చేయడం, మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవడం, సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యమైనవి. ఎవరైతే ఈ నాలుగింటిని క్రమం తప్పకుండా చేస్తారో వారు దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచగలుగుతారు. ఎవరైతే ఈ నాలుగింటిని అస్సలు పాటించరో, వారు దీర్ఘకాలిక వ్యాధులతో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది.

డబ్బు సంపాదన కాదు.. ఆరోగ్యంపై ఫోకస్ చెయ్యండి!
కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తుంచుకొని డబ్బు సంపాదన కంటే ఆరోగ్యం పైనే ముందు దృష్టి పెట్టాలి. అప్పుడే ఉన్నంతకాలం సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఎంత డబ్బు సంపాదిస్తామో, అంతకు మించిన డబ్బు ఆసుపత్రుల పాలు చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+