డయాబెటిస్ బాధితులు ఇవి తినకూడదు.. ఇవి తినొచ్చు!

ప్రస్తుత సమాజంలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. క్రమబద్ధమైన జీవన శైలి లేకపోవడం, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, అలాగే విపరీతమైన పని ఒత్తిడి కారణంగా చాలామంది డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు. డయాబెటిస్ వ్యాధిని పూర్తిస్థాయిలో మనం నయం చేయలేం. కానీ మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచటం కోసం మనం కచ్చితంగా ప్రయత్నించగలం.

డయాబెటిస్ బాధితులు ఇవి తినొద్దు
అయితే డయాబెటిస్ బాధితులు డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. డయాబెటిస్ బాధితులు ఆహారం విషయంలో ఏది పడితే అది తినకూడదు. తినే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్త అవసరం. డయాబెటిస్ బాధితులు ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినకూడదు. డయాబెటిస్ బాధితులు జంక్ ఫుడ్ తినకూడదు. పిజ్జాలు, బర్గర్ లు వంటి వాటికి దూరంగా ఉండాలి.

Diabetics should not eat these foods but they can eat these foods

మధుమేహంతో వీటిని అసలే తినకండి
కూల్ డ్రింక్స్ తాగకూడదు. డయాబెటిస్ బాధితులు కాఫీ, టీలకు కూడా దూరంగా ఉంటే మంచిది. చక్కెరతో తయారు చేసిన పదార్థాలను తినకూడదు. రెడ్ మీట్ ఎక్కువగా తినకూడదు. ఆహారం విషయంలో తప్పనిసరిగా నియమాలు పాటించాలి. ప్రతిరోజు నిర్దిష్ట సమయంలోనే ఆహారం తినాలి.

డయాబెటిస్ బాధితులు ఇవి తినొచ్చు
తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. శరీరానికి అవసరమైన నట్స్, సీడ్స్ తీసుకోవాలి. వాల్ నట్స్, బాదం పప్పు వంటి వాటిని తీసుకోవాలి. అలాగే చిరుధాన్యాలను ఆహారంగా ఎంచుకుంటే మంచిది. కొర్రలు, సామలు, ఊదలు, అండ్రుకొర్రలు, రాగులు, జొన్నలు వంటి తృణధాన్యాలను తీసుకుంటే మంచిది. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లను తినడానికి ఎంచుకోవాలి. ముఖ్యంగా తినే పండ్లలో యాపిల్, జామ, బొప్పాయి వంటి పండ్లను తింటే మంచిది.

ఫుడ్ మాత్రమే కాదు ఈ విషయాలలో జాగ్రత్త
డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలంటే కేవలం ఆహారం ఏం తినాలి.. ఏం తినకూడదు అనేది తెలుసుకోవడం మాత్రమే కాకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. శారీరక వ్యాయామం తో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. మంచి ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామంతో జీవనశైలిని మార్చుకుంటే డయాబెటిస్ ను కంట్రోల్ లో పెట్టవచ్చు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+