డైట్, వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా? కీలకమైన వీటిని మర్చిపోయి ఉంటారు
ఒబేసిటీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ఒబేసిటీతో సమాజంలో చాలామంది బాధపడుతున్నారు. ఇక ఒబేసిటీ కారణంగా వస్తున్న అనారోగ్య సమస్యలతో కష్టాలు పడుతున్నారు. బరువు తగ్గడం కోసం చాలామంది డైట్, వర్కౌట్లు తెగ చేస్తున్నారు. ఎటువంటి ఆహారం తింటే బరువు పెరగకుండా ఉంటాం? ఎటువంటి వర్కౌట్లు చేస్తే ఓవర్ వెయిట్ ను కంట్రోల్ చేస్తాం? వంటి అనేక అంశాల పైన ఫోకస్ చేస్తున్నారు.
బరువు తగ్గాలని డైట్, వ్యాయామం చేసినా ఫలితం లేదా ?
బరువు తగ్గడం కోసం క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని, ప్రోటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటున్నారు. ఇక ఈ ఫుడ్స్ తో డైట్ పాటిస్తూ బరువు తగ్గుతామని తెగ తాపత్రయ పడుతున్నారు. అంతేకాదు బరువు తగ్గడం కోసం రెగ్యులర్ గా శారీరక వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ చాలామంది బరువు మాత్రం తగ్గడం లేదు.

బరువు తగ్గాలంటే ఇవి కీలకం
ఇన్ని చేసిన బరువు ఎందుకు తగ్గడం లేదు అని ఆలోచించే వారికి, ఈ రెండు మాత్రమే కాదు మరికొన్ని అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. బరువు తగ్గాలనుకునే వారికి నిద్ర చాలా ముఖ్యమని, ప్రతిరోజు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోయిన వారు ఆరోగ్యంగా ఉంటారని, బరువు తగ్గడానికి అవకాశం ఉందని చెబుతున్నారు.
వెయిట్ లాస్ కావాలంటే ఇలా చెయ్యండి
సరైన నిద్ర లేకపోతే హార్మోన్ల అసమతుల్యత పెరిగి, బరువు తగ్గకపోగా పెరిగే రిస్కు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక వెయిట్ లాస్ కావాలనుకునేవారు మానసిక ఒత్తిడి నుండి కూడా బయట పడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి ఆకలి పెరుగుతుంది. దీనివల్ల వారికి కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బరువు తగ్గాలి అనుకునేవారు ఒత్తిడి తగ్గేలా ధ్యానం, యోగ, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయాలి.
వీటిపై ఫోకస్ చేస్తే బరువు తగ్గుతారు
ఇక బరువు తగ్గాలనుకునే వారు రోజు తగినంత మోతాదులో నీటిని తాగాలి. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఆహారాన్ని వేగంగా కాకుండా నెమ్మదిగా నమిలి తినాలి. దీనివల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. తినే సమయాలలో వేరే విషయాల పైన దృష్టి పెట్టకూడదు. ఎంత తింటున్నామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వీటి మీద కూడా ఫోకస్ చేస్తే బరువు ఈజీగా తగ్గుతారు.












Click it and Unblock the Notifications