ముఖానికి ఇవి అసలే రాసుకోవద్దు.. చర్మం ఇస్తున్న హెచ్చరిక!
చాలామంది ముఖ సౌందర్యం కోసం రకరకాల ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు . అయితే కొన్ని రకాల పదార్థాలను ముఖానికి అస్సలు రాసుకోకూడదు. మనకు తెలిసి తెలియక కొన్ని పదార్థాలు ముఖానికి రాసుకోవడం వల్ల అనవసరమైన అనర్ధాలు చోటుచేసుకుంటాయి. ముఖం పైన చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. మన మిగతా శరీర భాగం అంతా ఉన్న చర్మానికి ముఖం పైన ఉన్న చర్మానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
ముఖానికి ఇవి అస్సలు రాయొద్దు
అందుకే ముఖానికి రాసే లోషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది బ్లాక్ హెడ్స్ తగ్గుతాయని ముఖానికి టూత్ పేస్ట్ రాస్తుంటారు. టూత్ పేస్ట్ ముఖానికి రాసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. టూత్ పేస్ట్ లో చాలా బలమైన కెమికల్స్ ఉంటాయి .ఇవి ముఖం పైన ఉన్న చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల ముఖం పైన చర్మంపై దురదలు, మచ్చలు, మంట వచ్చే అవకాశం ఉంటుంది.

ముఖానికి బాడీ లోషన్ రాస్తున్నారా?
ఇక చాలామంది బాడీ లోషన్స్ ను శరీరంతో పాటుగా ముఖానికి కూడా రాసుకుంటూ ఉంటారు. అయితే ఇలా రాయడం మంచిది కాదు. ముఖంపైనే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. బాడీ లోషన్ రాస్తే ముఖం పైన ఉండే స్వేద గ్రంధులు మూసుకు పోతాయి. ఫలితంగా అనేక సమస్యలు వస్తాయి.
వ్యాజలైన్, పెట్రోలియం జెల్లీ రాసుకుంటున్నారా?
కొంతమంది పెట్రోలియం జెల్లీ, వ్యాజలైన్ వంటి వాటిని ముఖానికి రాసుకుంటూ ఉంటారు. అయితే ఇది కూడా ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. పెట్రోలియం జెల్లిని ఎక్కువగా ముఖానికి రాసుకుంటే ముఖం పైన మచ్చలు, ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుందని ముఖానికి ఎప్పుడు ఫేషియల్ మాయిశ్చరైజర్స్ మాత్రమే రాసుకోవాలని చెబుతున్నారు.
ఆల్కాహాల్, షాంపూ లతోనూ జాగ్రత్త
ఇక కొందరు ముఖం పైన వేసుకున్న మేకప్ తీయడం కోసం ఆల్కహాల్ తో క్లీన్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఏమాత్రం మంచిది కాదని దీని వల్ల ముఖం పైన దురద వస్తుందని చెబుతున్నారు. పొరపాటున కూడా ముఖం పైన ఆల్కహాల్ రాయకూడదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు తలస్నానం చేసేటప్పుడు హెయిర్ షాంపులను ముఖానికి రాసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.
ముఖానికి రాసుకునే లోషన్స్ తో జాగ్రత్త
ఒకవేళ షాంపు నురగ ముఖంపై పడిన కూడా వెంటనే క్లీన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. షాంపూలు వెంట్రుకలకు మేలు చేసినా, ముఖం పైన ఉన్న చర్మానికి మాత్రం హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ముఖం పైన చర్మానికి దురదలు, మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అందుకే ముఖానికి రాసుకునే లోషన్స్ విషయంలో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!












Click it and Unblock the Notifications