బరువు త్వరగా తగ్గాలంటే నిద్రకు ముందు ఈ పనులు తప్పక చేయండి!
ఒబేసిటీ.. ఇప్పుడు సమాజంలో అతిపెద్ద సమస్యగా మారింది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా చాలామంది విపరీతంగా బరువు పెరుగుతున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం ఒబేసిటీకి ఒక కారణంగా మారింది. అయితే విపరీతంగా బరువు పెరిగినవారు బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే మంచిదని చెబుతున్నారు వైద్యనిపుణులు.
బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయండి
బరువు తగ్గాలని ప్రయత్నించేవారు సహజంగా ఉదయం పూట వ్యాయామం చేయడాన్ని ఇష్టపడతారు. అయితే రాత్రి వేళల్లో కూడా బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే మంచిదని, నిద్రపోయేటప్పుడు క్యాలరీలను బర్న్ చేయడంలో ఈ పనులు ఎంతో సహాయపడతాయని చెబుతున్నారు. ఇక రాత్రివేళ నిద్రపోయే ముందు ఉదయం ఏ విధంగా అయితే వ్యాయామం చేస్తామో అదే విధంగా వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.

రాత్రి డిన్నర్ ఇలా చేస్తే బరువు తగ్గుతారు
రాత్రిపూట నిద్రపోయే ముందు వ్యాయామం చేయడం వల్ల ఇది శరీరానికి విశ్రాంతిని, మంచి నిద్రను ఇస్తుందని చెబుతున్నారు. ఇక బరువు తగ్గాలని భావించేవారు రాత్రి నిద్రపోయే ముందు డిన్నర్ త్వరగా తినాలి. ఆలస్యంగా డిన్నర్ చేస్తే అది బరువును పెంచుతుందని, పడుకోవడానికి రెండు మూడు గంటల ముందు డిన్నర్ పూర్తి చేస్తే మంచిదని చెబుతున్నారు. డిన్నర్ సమయం ప్రకారం చేస్తే శరీరం క్యాలరీలను బర్న్ చేయడం ఈజీ అవుతుందని చెబుతున్నారు.
నిద్రకు ముందు ఈ పని చేస్తే మంచి ఫలితం
చాలామంది రాత్రి భోజనం తర్వాత వెంటనే పడుకుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. తిన్న తర్వాత కాసేపు నడవడం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు ఉబ్బరాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇది మీ శరీరం అదనపు కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఇక బరువు తగ్గాలనుకునేవారు మీ స్క్రీన్ సమయాన్ని కూడా తగ్గించాలి. నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్లు, కంప్యూటర్లు చూడడం, టీవీ చూడడం మానుకోవాలి.
నిద్రపోయే ముందు ఇవి మానుకోండి
బరువు తగ్గాలన్నా, శరీరానికి కావలసిన విశ్రాంతి పొందాలన్నా ఈ అలవాట్ల నుండి దూరంగా ఉండాలి. ఇక బరువు తగ్గాలనుకునే వారు నిద్రపోయే ముందు స్నాక్స్ తినడం మానుకోవాలి. బరువు తగ్గాలంటే ప్రతి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు ప్రశాంతమైన నిద్రపోవాలి. నిద్రపోయినప్పుడే శరీరంలోని హార్మోన్ల సమతుల్యం అవుతుంది. మన శరీరంలోని ఫ్యాట్ బర్న్ అవుతుంది.
నిద్రకు ముందు ధ్యానం .. బరువుకు చెక్
ఇక నిద్రపోయే ముందు ధ్యానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ధ్యానం మన శరీరాన్ని, మనసుని కంట్రోల్లో ఉంచి మనకు డీప్ స్లీప్ ను ఇస్తుంది. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్రపోయే ముందు ఈ పనులు చేసి ఈజీగా బరువు తగ్గండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications