చిలగడదుంపలు ఇచ్చే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా!
మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి .అటువంటి వాటిల్లో చిలగడదుంపలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చిలగడదుంపలలో ఫైబర్, విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బీ6, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మ్యాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.
చిలగడ దుంపలతో ఆరోగ్యం
చిలగడదుంపలలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి చేరిన తరువాత విటమిన్ ఏగా మారి మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. చిలగడ దుంపల కారణంగా మన కంటి చూపు మెరుగుపడుతుంది . చిలగడ దుంపలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆకలితో పాటు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

బీపీని తగ్గించే, నొప్పులను నివారించే చిలగడదుంప
చిలగడదుంపలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన హైబీపీని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో వాపులను, నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. చిలగడదుంపలు కొన్ని రకాల క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తాయి. చిలగడదుంపలు తినడం వల్ల మన మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
చిలగడదుంపతో ఊబకాయానికి చెక్
చిలకడదుంపలు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ను తగ్గించి మన ఆరోగ్యానికి బాగా దోహదం చేస్తాయి. చిలగడదుంపలు మన రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మన శరీరాన్ని కాలానుగుణ వ్యాధుల నుంచి కాపాడతాయి. ఊబకాయంతో బాధపడే వారికి ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. చిలగడదుంపని ఆహారంగా తీసుకోవడం వల్ల మన కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఉంటాము.
చర్మ, జుట్టు ఆరోగ్యం కోసం చిలగడ దుంప
చిలగడదుంప విటమిన్ సి యొక్క మంచి మూలం. చిలకడ దుంపతో చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే చిలగడదుంపలను ఆహారంలో భాగంగా చేసుకుంటే అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications