బరువు తగ్గాలని అన్నం పూర్తిగా మానేస్తే ఏమవుతుందో తెలుసా?
ప్రస్తుత సమాజంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక ఊబకాయంతో బాధపడేవారు త్వరగా బరువు తగ్గాలంటే అన్నం తినడం మానేసి సిరి ధాన్యాలు తినాలని చాలా మంది సలహా ఇస్తున్నారు. అయితే సిరి ధాన్యాలు తినటం మంచిదే కానీ ఒక్కసారిగా బరువు తగ్గాలని అన్నం తినడం మానేస్తే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
అన్నం మానేస్తే బరువు తగ్గుతారా?
వెయిట్ లాస్ కోసం అన్నం మానేయాలని భావించేవారు ఈ విషయంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నం తినడం పూర్తిగా మానేస్తే బరువు తగ్గుతారని చెప్పేది కేవలం అపోహ మాత్రమేనని చెబుతున్నారు నిపుణులు. అన్నంలో మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు, పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి కాబట్టి అన్నం మానుకోవడం మంచిది కాదంటున్నారు.

అన్నం తినే విషయంలో జాగ్రత్తలు అవసరం
అయితే తినే ఆహారం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించి నిదానంగా ఒక క్రమ పద్ధతిలో బరువు తగ్గాలి గాని ఒక్కసారిగా అన్నం మానేయడం.. ఒక్కసారిగా మళ్ళీ అన్నం తినడం చేస్తే జీవితంలో బరువు తగ్గే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు. అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకునేవారు అన్నం పూర్తిగా మానేయడం మంచిది కాదు అయితే అన్నం తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
అన్నం ఇలా తినండి
కొద్దిగా అన్నాన్ని అన్నంతో సమానంగా కూరను పెట్టుకొని తింటే మంచిది. రైస్ తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పెరగవు. అలాగే కూరలు, పప్పులలో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి అన్నంతో సమానంగా వీటిని తీసుకోవడం వల్ల ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. బరువు తగ్గాలని తదేకంగా పట్టుదలతో అన్నాన్ని పూర్తిగా మానేయడం చేసి మళ్లీ పెద్ద మొత్తంలో అన్నం తినడం చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది.
శరీరానికి కార్బోహైడ్రేట్స్ అవసరం
బరువు తగ్గాలి అన్న ఆలోచన దృఢంగా ఉన్నవారు నిదానంగా బరువు తగ్గడం పైన ఫోకస్ చేయాలి కానీ ఒక్కసారిగా అన్నం మానేసి బరువు తగ్గడానికి ప్రయత్నించకూడదు. మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ కూడా చాలా అవసరం. కాబట్టి ఖచ్చితంగా అన్నాన్ని మన ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. కానీ కొద్ది మొత్తంలోనే అన్నం తినడం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications