బొప్పాయి గింజలను తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా!

మన శరీర ఆరోగ్యానికి దోహదం చేసే వాటిలో పండ్లు ముఖ్యమైనవన్న విషయం తెలిసిందే. పండ్లలో బొప్పాయి పండ్లు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే బొప్పాయి పండు మాత్రమే కాదు బొప్పాయి గింజలు కూడా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. బొప్పాయి పండులో ఏ విధంగా అయితే పోషకాలు ఉంటాయో.. బొప్పాయి గింజల్లో కూడా అదే విధంగా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

బొప్పాయిలోనే కాదు బొప్పాయి గింజల్లోనూ ఫుల్ పోషకాలు
బొప్పాయి లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె లతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ తదితర పోషకాలు ఉంటాయి. ఇక బొప్పాయి లో ఏ విధంగా అయితే పోషకాలు ఉంటాయో అదేవిధంగా బొప్పాయి గింజల్లో కూడా ఫుల్ పోషకాలు ఉంటాయి. బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి.

Do you know what happens to your body when you eat papaya seeds

బొప్పాయి గింజలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఒలిక్ యాసిడ్, పాలి ఫెనాల్స్, మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయి గింజల్లో ఉండే ఫైబర్ మన జీర్ణ క్రియకు ఎక్కువ మద్దతు ఇవ్వడంతో పాటు శరీరంలోని వ్యర్ధాలను సులభంగా తొలగిస్తుంది.

జీర్ణ వ్యవస్థకు బొప్పాయి గింజలతో మేలు
శరీరం అదనపు కొవ్వును నిలువ చేయకుండా బొప్పాయి గింజలు నియంత్రిస్తాయి. బరువును కంట్రోల్ చేయడంలో బొప్పాయి గింజలు దోహదం చేస్తాయి. బొప్పాయి గింజల్లో ఉండే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బొప్పాయి గింజల్లో కార్పైన్ ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. బొప్పాయి గింజల్లో ఉన్న అధిక ఫైబర్ పేగుల కదలికలను నియంత్రిస్తుంది .మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగులలో ఉండే నులి పురుగులను చంపుతుంది.

బొప్పాయి గింజలతో పీరియడ్స్ రెగ్యులర్
బొప్పాయి గింజల్లో పాలి ఫెనాల్స్ ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు గా పనిచేసి మనల్ని అనేక రకాల క్యాన్సర్ల నుండి కాపాడతాయి. బొప్పాయి గింజల్లో ఉండే కెరోటిన్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. బొప్పాయి గింజలు రుతుక్రమాన్ని ప్రేరేపించడంతోపాటు, ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడానికి, పీరియడ్స్ సాధారణంగా రావడానికి తోడ్పడతాయి. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడానికి కూడా బొప్పాయి గింజలు దోహదం చేస్తాయి.

వీరికి బొప్పాయి గింజలతో నొప్పుల ఉపశమనం
బొప్పాయి గింజల్లో విటమిన్ సి తో పాటు ఇతర ఆరోగ్యానికి దోహదం చేసే పలు సమ్మేళనాలు ఉండడంవల్ల ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీలుగా పనిచేస్తాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, గౌట్ ఉన్నవారు బొప్పాయి గింజలను తింటే మంచిది. అయితే బొప్పాయి గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవాలనుకునేవారు ఒక రోజుకు ఒక గ్రామును లేదా ఐదు బొప్పాయి గింజలను మాత్రమే తినాలని అంతకంటే ఎక్కువ తినకూడదని చెబుతున్నారు. అయితే బొప్పాయి గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవాలనుకునేవారు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి వైద్యుల సూచన మేరకే తీసుకుంటే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+