అతిగా తలస్నానం చేయటం వలన జుట్టు ఏం అవుతుందో తెలుసా!
జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. జుట్టు ఆరోగ్యం కోసం చేయవలసిన పనులను, తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది. చాలామంది తరచూ తలస్నానం చేస్తూ ఉంటారు. దీనివల్ల జుట్టు మురికి పోయి ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తారు. అయితే అతిగా తలస్నానం చేయడం అనేది జుట్టుకు నష్టం చేకూరుస్తుందని డెర్మటాలజిస్ట్ లు చెబుతున్నారు.
అతిగా తలస్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు
అతిగా తలస్నానం చేయడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమిటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.తరచుగా జుట్టు కడగడం వల్ల, అతిగా తలస్నానం చేయడం వల్ల తల ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతారు. రోజువారీ జుట్టు సంరక్షణ, తల ఆరోగ్యం మధ్య సంబంధాన్ని వివరిస్తూ, ప్రజలు గమనించాల్సిన సంకేతాలను ఇది తెలియజేస్తుంది.తరచుగా జుట్టు కడగడం వల్ల, అతిగా తలస్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు చాలానే ఉన్నాయి.

అతిగా తలస్నానం చేస్తే జరిగే నష్టాలు ఇవే
తలస్నానం చేయడానికి ఉపయోగించే కెమికల్ షాంపూలతో జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. జుట్టు రాలిపోతుంది. జుట్టు నిర్జీవంగా మారుతుంది. జుట్టు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడం కోసం చేసే ఈ అలవాటు కూడా తల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల తలచర్మం ఎక్కువగా పొడిబారిపోతుంది. స్కాల్ప్ లో మనకు కావలసిన సహజ నూనె పూర్తిగా పోతుంది . అతిగా తలస్నానం చేయడం వల్ల తల చర్మం మరింత ఎక్కువ ఆయిల్ ను ఉత్పత్తి చేస్తుంది.
అతిగా తలస్నానం చేస్తే జుట్టు తెగిపోయే ప్రమాదం
ఫలితంగా జుట్టు త్వరగా ఆయిలీగా మారుతుంది. రూట్స్ వద్ద జుట్టు బలహీనపడుతుంది. జుట్టు తెగిపోయే ప్రమాదం పెరుగుతుంది. కొత్తగా వచ్చే జుట్టు కూడా బలహీనంగా తయారవుతుంది. అతిగా కడగడం వల్ల జుట్టు సహజసిద్ధమైన తేమను కోల్పోతుంది. బాగా డ్రైగా, రఫ్ గా మారుతుంది. దీనివల్ల జుట్టు బ్రేకేజ్ పెరుగుతుంది.
అతిగా తలస్నానం చేయటం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు
అతిగా తలస్నానం చేయడం వల్ల తల చర్మం సెన్సిటివ్ అవుతుంది. చిన్న చిన్న పింపుల్స్ కనిపిస్తాయి. ఇవి కూడా కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకే అతిగా తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది మీ జుట్టును మీకు అర్ధం కాకుండానే నాశనం చేస్తుంది.












Click it and Unblock the Notifications