మైగ్రేన్ తలనొప్పి వేధిస్తుందా? కారణాలు, లక్షణాలు, నివారణలు ఇవే!

ప్రస్తుత జీవన శైలి కారణంగా చాలామంది అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. అటువంటి అనారోగ్య సమస్యలలో మైగ్రేన్ ఒకటి. మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పితో కూడిన నాడీ సంబంధిత రుగ్మత. ఇది సాధారణంగా ఒత్తిడి కారణంగా వస్తుంది. తలకు ఒక వైపున లేదా రెండు వైపులా విపరీతమైన నొప్పితో కొన్ని గంటల నుండి రోజుల వరకు కూడా ఈ నొప్పి ఉండవచ్చు.

మైగ్రేన్ లక్షణాలు
మైగ్రేన్ యొక్క సాధారణ లక్షణాలలో తలనొప్పి తీవ్రంగా ఉండవచ్చు. కంటి చూపులో మార్పులు, కంటి చూపు మందగింపు, చేతుల్లో జలదరింపు, కడుపులో వికారం, వాంతులు, విరోచనాలు, కాంతి మరియు శబ్ద సున్నితత్వం, నీరసం, విపరీతమైన అలసట, కండరాల బలహీనత, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, ఆందోళన వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. కుటుంబ చరిత్రలో మైగ్రేన్ ఉంటే కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది.

Do you suffer from migraine headache Here are the causes symptoms and remedies

మైగ్రేన్ తలనొప్పి రావడానికి కారణాలు ఇవి కూడా కావొచ్చు
కొందరిలో శరీరం డీహైడ్రేషన్ కు గురైతే కూడా మైగ్రేన్ వస్తుంది. మెడనొప్పి ఎక్కువగా ఉన్నవారిలో కూడా మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఉంది. క్రమరహిత జీవనశైలి, భావోద్వేగ ఒత్తిడి, తీవ్రమైన శారీరక శ్రమ, పానీయాలను ఎక్కువగా తీసుకోవడం, సరైన సమయానికి తినకపోవడం కూడా మైగ్రేన్ తలనొప్పి రావడానికి కారణాలుగా చెప్పవచ్చు.

వీటివల్ల మైగ్రేన్ తలనొప్పి ప్రమాదం
ఎక్కువగా ప్రయాణాలు చేసే వారిలోనూ, వాతావరణంలో మార్పుల కారణంగాను, వెన్నెముక సమస్యలు ఉన్న వారిలోనూ, ఎక్కువగా ధూమపానం, మద్యపానం చేసే వారిలోనూ, మైగ్రేన్ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ లాంటివి వాడే వారిలోనూ, నిరాశ ఆందోళనలకు లోనయ్యే వారిలోనూ, నిద్ర రుగ్మతలు ఉన్న వారిలోనూ మైగ్రేన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మైగ్రేన్ తలనొప్పి కారణంగా ఈ ప్రమాదం
మైగ్రేన్ తలనొప్పి వచ్చిన వారిలో కళ్ళు ఎర్రబడడం, కళ్ళల్లో నీళ్ళు రావడం, మాట్లాడలేకపోవడం, కళ్ళముందు జిగ్జాగ్ లైన్లు కనబడడం, శబ్దాలు వినిపించడం, కాళ్లు చేతులలో తిమ్మిర్లు రావడం, తల తిరగడం, వాంతులు కావడం, వికారం అనిపించడం, తలలో తీవ్రమైన నొప్పి రావడం వంటి సాధారణమైన లక్షణాలు కనిపిస్తాయి. అయితే మైగ్రేన్ తలనొప్పి తగ్గాలంటే అన్నిటికంటే ముందుగా జీవనశైలి మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నిద్ర మరియు ఆహారపు అలవాట్లు చేసుకోవాలి.

మైగ్రేన్ తలనొప్పి తగ్గేందుకు ఇలా చెయ్యండి
ఒత్తిడి నిర్వహించడానికి యోగా, ధ్యానం వంటి వాటిని చేయాలి. మైగ్రేన్ తలనొప్పి ట్రిగ్గర్ అయ్యే ఆహారాలను నివారించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు తగినంత నీటిని తాగాలి. నొప్పి నివారణ ఔషధాలను, మైగ్రేన్ కు డాక్టర్ ఇచ్చే మందులను తప్పనిసరిగా వాడాలి. నొప్పి మొదలైనప్పుడు ప్రశాంతంగా నిశ్శబ్దంగా, కాంతిలేని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి. నొప్పి ఉన్నచోట వెచ్చని లేదా చల్లని కంప్రెస్ ను తలపైన పెట్టుకోవాలి. ఈ విధంగా మైగ్రేన్ తలనొప్పి నుంచి కొంతమేర ఉపశమనాన్ని పొందవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+