క్రిస్పీ "దొండకాయ ఫ్రై" ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..!
దొండకాయ కూర లేదా పచ్చడి అంటే చాలా మంది.. ముఖ్యంగా పిల్లలు, పెద్దగా చూపు పెడతారు. అయితే పెళ్లిళ్లలో శుభకార్యాల్లో వడ్డించే క్రిస్పీ దొండకాయ వేపుడుని మాత్రం అందరూ ఆస్వాదిస్తారు. అదే రుచిని ఇంట్లో తయారు చేయాలన్నా.. క్యాటరింగ్ స్టైల్ ఫ్లేవర్ రాదని చాలా మంది నిరాశ చెందుతుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే అచ్చం పెళ్లి వంట రుచి వచ్చే వెడ్డింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం..
దొండకాయలు సన్నని, పొడవైన ముక్కలుగా కట్ చేస్తే క్రిస్పీగా అవుతాయి. కట్ చేసిన తర్వాత 5 నిమిషాలు పక్కన ఉంచితే లోపల తేమ తగ్గి మసాలా బాగా అంటుతుంది. శనగపిండి-కార్న్‌ఫ్లోర్ కలయికే పెళ్లి వంటల రహస్యం. ఇదే క్రంచ్ ఇస్తుంది. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వల్ల క్యాటరింగ్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. ఈ దొండకాయ ఫ్రైని రైస్-సాంబార్‌తో, పెరుగు అన్నంతో, పప్పుతో లేదా స్నాక్‌గా కూడా వడ్డిస్తే సూపర్‌గా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు..
- దొండకాయలు - 300 గ్రాములు
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - అవసరానికి తగినంత
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- జీలకర్ర పొడి - ½ టీస్పూన్
- పసుపు - ½ టీస్పూన్
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్‌స్పూన్లు
- శనగపిండి (బెసన్) - 2 టేబుల్‌స్పూన్లు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- నిమ్మరసం - 1 టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి - 3 నుంచి 4
- కరివేపాకు - కొద్దిగా
తయారీ విధానం..
శుభ్రంగా కడిగిన దొండకాయలను పొడవుగా సన్నని ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్‌లో వేసుకోవాలి.
ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కార్న్‌ఫ్లోర్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి దొండకాయ ముక్కలకి బాగా పట్టేలా కలపాలి.
మిశ్రమం పొడిగా అనిపిస్తే, ఒకటి రెండు టీస్పూన్ల నీరు చేర్చొచ్చు.
చివర్లో నిమ్మరసం వేసి మసాలా అన్ని ముక్కలకూ సమంగా అంటేలా కలపాలి.
ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక మంటను లో-ఫ్లేమ్‌లో పెట్టి, దొండకాయ ముక్కలను కొద్దికొద్దిగా నూనెలో వేసుకోవాలి.
మొదటి 1-2 నిమిషాలు కలపకండి. అప్పుడు పిండి పొర విడిపోదు.
తర్వాత మంటను మీడియంకి పెంచి అన్ని వైపులా బంగారు రంగులోకి మారేవరకు తిప్పుతిప్పి వేయించుకోవాలి.
వేస్తూ ఉండగా ముక్కలు ఒకదానికొకటి అంటుకుంటే స్పూన్‌తో జెంట్లీ విడదీయండి.
అదే నూనెలో చీలికలు చేసిన పచ్చిమిర్చి, కరివేపాకును వేయించి తీసుకోవాలి.












Click it and Unblock the Notifications