ఈ నాలుగు నెలలు ఆకుకూరలు తినొద్దు!!
సహజంగా వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు ఫ్రెష్ గా కనిపిస్తాయి వర్షాలు పడుతుంటే ఆకుకూరలైతే మరింత నవనవలాడుతాయి. పచ్చగా, ఫ్రెష్ గా కనిపించే ఆకుకూరలు చూడగానే వండుకుని తినాలనిపిస్తుంది. ఆకుకూరలు తింటే మంచిదని చాలామంది ఆకుకూరలను కొనుగోలు చేసి వండుకుని తింటారు. కానీ ఈ నాలుగు నెలలు ఆకుకూరలు తినటం మంచిదికాదని చెప్తున్నారు.
వర్షాకాలం ఆకుకూరలు మంచిదేనా ?
అయితే వర్షాకాలంలో ఆకుకూరలు తినడం మంచిదేనా? వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఏమవుతుంది?అన్న విషయాలను పట్టించుకోరు. అయితే వర్షాకాలంలో ఆకుకూరలు తినటం ఎంత డేంజరో అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వర్షాకాలంలో ఆకుకూరలు తినటం మంచిది కాదు. వర్షాకాలంలో ఆకుకూరలను తినడం కోరి కోరి రోగాలను తెచ్చి పెట్టుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు.

ఆకుకూరలపై కంటికి కనిపించని ఫంగస్, బ్యాక్టీరియా
వర్షాకాలంలో మన కంటికి కనిపించని బ్యాక్టీరియా, ఫంగస్ ఆకుకూరల పైన దాగి మన కడుపులోకి వెళతాయని, ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో సహజంగానే వైరస్ లు విజృంభిస్తాయి. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది.
ఆకుకూరలు మంచిదే కానీ వర్షాకాలంలో కాదు
ఇక ఈ సమయంలో ఆకుకూరలు, కూరగాయల పైన కూడా మన కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది. ముఖ్యంగా ఆకుకూరల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వర్షాకాలంలో ఆకుకూరలు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. వాస్తవంగా ఆకుకూరలు తింటే మంచిదే కానీ వర్షాకాలంలో మాత్రం కాదు.
వర్షాకాలంలో ఇవి తినొద్దు
వర్షాకాలంలో ఆకుకూరలు తినటం వలన ముఖ్యంగా అజీర్తి, డయేరియా, రకరకాల అలర్జీలు, కలరా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో పాలకూర, బచ్చలకూర, తోటకూర, గోంగూర ,క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి వాటిని తినకుండా ఉంటేనే మంచిదని హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలం ఈ జాగ్రత్తలు తీసుకోండి
వర్షాకాలంలో ఏది తిన్నా బాగా ఉడికించాకే తినాలి,ఏది తాగినా బాగా కాచిన తర్వాతనే తాగాలి. ఈ సీజన్ రోజాల సీజన్ కాబట్టి తినే ఆహారంలోనూ, తాగే నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనమే కాపాడుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications