బరువు తగ్గాలంటే వీటిని అశ్రద్ధ చెయ్యొద్దు.. అసలు సీక్రెట్స్ చెప్తున్న ఫిట్నెస్ ట్రైనర్స్!
ఒబేసిటీ.. ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది ఒబేసిటీ తో బాధపడుతున్నారు. బరువు తగ్గడం కోసం నానా పాట్లు పడుతున్నారు. కొంతమంది తినడం మానేసి, డైటింగ్ చేస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తుంటే, మరికొంతమంది జిమ్ లు, ఏరోబిక్స్ అంటూ పరుగులు పెడుతున్నారు. అయితే కొంతకాలం బరువు తగ్గినట్టే తగ్గి మళ్లీ విపరీతంగా బరువు పెరుగుతున్నారు.
బరువు తగ్గాలంటే ఇలాగే తగ్గాలి
ఇక బరువు తగ్గాలి అని భావించేవారు ముఖ్యంగా కొన్ని విషయాల మీద శ్రద్ధ పెట్టాలని ఫిట్నెస్ కోచ్ లు చెబుతున్నారు. ఎలా పడితే అలా తిని బరువు పెరిగి ఒక్కసారిగా బరువు తగ్గిపోవాలంటే ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందని ఆ ప్రొసీజర్ ప్రకారమే బరువు తగ్గాలని సూచిస్తున్నారు.

బరువు తగ్గాలంటే ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు అవసరం
బరువు తగ్గాలి అని భావించే వారు, తప్పకుండా పాటించవలసిన సూచనలను తెలియజేస్తున్న వారు ఆహారం పైన దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఏమి తింటున్నాము.. ఎంత తింటున్నాం అనే దానిపైన శ్రద్ధ పెట్టాలి. పౌష్టికాహారం తినేలా చూసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కచ్చితంగా దూరం పెట్టాలి. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఎక్కువ మొత్తంలో ఆహారం తినడం మంచిది కాదు.
ఈ ఆహారాలు వద్దు.. వ్యాయామం విషయంలో ఇలా చెయ్యొద్దు
ఆహారం తీసుకునేటప్పుడు రెండు గంటలకు ఒకసారి చాలా మితంగా తినడం మంచిదని చెబుతున్నారు. ఆహారంలో చక్కెర పదార్థాలు, డీప్ ఫ్రై, నూనె పదార్థాలు, బయట ఫుడ్స్ తీసుకోకుండా ఉంటే మంచిది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. బరువు తగ్గాలని అతిగా వ్యాయామం చేయడం, ఆ తర్వాత సడన్ గా వ్యాయామాన్ని ఆపడం చేయడం మంచిది కాదు.
నిద్ర విషయంలో జాగ్రత్త
కనుక వ్యాయామం విషయంలో కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం చేయాలి. ఇక చాలామంది ఫుడ్ కంట్రోల్ చేసాం.. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నామని, మరొక ముఖ్యమైన విషయాన్ని మరిచిపోతారు. అది నిద్ర. బరువు తగ్గాలంటే ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. బరువు తగ్గాలని భావించేవారు ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి.
బరువు తగ్గాలంటే ఇది కంపల్సరీ
సరైన నిద్ర శరీరంలోని అనారోగ్య సమస్యలను తగ్గించి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు బరువు తగ్గడానికి చేసే ప్రయత్నం కూడా సఫలం అవుతుంది. ఏదైనా ఇక చేస్తే మంచిది కాదు. పద్ధతిగా చేస్తేనే ఫలితం ఉంటుందని ఫిట్నెస్ ట్రైనర్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications