ఈ పండ్లు ఫ్రిజ్ లో పెట్టి తింటున్నారా? డేంజర్!
చాలామంది ఇంటికి ఏ పండ్లు తెచ్చుకున్న ముందు ఫ్రిజ్లో పెడతారు. ఫ్రిజ్లో పెట్టి బాగా చల్లగా అయిన తర్వాత తిందామని, అలా తింటే రుచిగా ఉంటుందని భావిస్తారు. అయితే మార్కెట్లో కొని తీసుకువచ్చిన కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్లో పెట్టుకొని తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు రిఫ్రిజిరేటర్ లో పెట్టకూడని పండ్లు ఏమిటి? వాటిని ఎందుకు మనం ఫ్రిజ్లో పెట్టకూడదు అనే విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
యాపిల్ పండ్లు ఫ్రిజ్ లో పెడుతున్నారా?
ఫ్రిజ్ లో పెట్టకూడని పండ్ల విషయానికొస్తే యాపిల్ పండ్లు ఒకటి . యాపిల్ పండ్లను ఫ్రిజ్లో ఉంచకూడదు. యాపిల్ పండులో ఉండే క్రియాశీల ఎంజైముల కారణంగా అవి త్వరగా పక్వానికి వస్తాయి. ఫ్రిజ్లో పెట్టడం వల్ల వాటిలో ఉండే పోషకాలు పోతాయి. ఇక బయట పెడితే ఆపిల్ పండు ఫ్రెష్ గా ఉండట్లేదు అని భావించేవారు వాటిని కాగితంలో చుట్టి పెడితే ఫ్రెష్ గా ఉంటాయి.

అరటిపండ్లు ఫ్రిజ్ లో పెడితే డేంజర్
ఇక ఫ్రిజ్లో చాలామంది అరటి పండ్లను పెడుతూ ఉంటారు. అరటి పండ్లు ఫ్రిజ్లో పెట్టి తినడం మంచిది కాదు. ఫ్రిజ్లో అరటి పండ్లను పెడితే అవి కుళ్లిపోయినట్టుగా మారుతాయి. అరటి పండ్లను ఎప్పుడు రూమ్ టెంపరేచర్ లోనే ఉంచుకోవడం మంచిది. ఫ్రిజ్లో పెట్టుకుని తిన్న అరటి పండ్లు రుచి కూడా మారుతాయి. వాటిలో ఉండే పోషకాలన్నీ నశించిపోతాయి. కనుక ఫ్రిజ్లో అరటి పండ్లను పొరపాటున కూడా పెట్టి తినకూడదు.
జామ పండ్లు ఫ్రిజ్ లో పెట్టొద్దు ఎందుకంటె
ఫ్రిజ్ లో జామ పండ్లను కూడా పెట్టకూడదు. జామ పండ్లు చలి వాతావరణాన్ని తట్టుకోలేవు .వీటిని ఫ్రిజ్లో పెడితే వీటిలో ఉండే నీటి శాతం బాగా తగ్గిపోతుంది .అంతేకాదు జామ పండు కూడా రుచి లేకుండా తయారవుతుంది. జామపండ్లలో ఉండే పోషకాలు కూడా నశిస్తాయి. కాబట్టి జామ పండ్లను పొరపాటున కూడా ఫ్రిజ్లో పెట్టి తినకూడదు.
ఫ్రిజ్ లో పెట్టిన ఈ పండ్లు తినటం మంచిది కాదు
ఇవి మాత్రమే కాదు మామిడి పండ్లు, స్ట్రాబెర్రీలు, పనసపండు, పుచ్చ పండ్లు ఇలా వేటిని ఫ్రిజ్ లో ఎక్కువ సేపు పెట్టి తినడం మంచిది కాదు. బయట సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న పండ్లే మనకు తింటే పోషకాలను ఇస్తాయి. ఎప్పుడైనా పండ్లు సాధారణమైన వాతావరణంలో ఉన్నప్పుడే వాటిల్లో ఉండే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
రిఫ్రిజిరేట్ చేసిన పండ్లలో పోషకాలు తక్కువ
సాధారణంగా వాతావరణం నుంచి ఫ్రిజ్లో పెడితే మాత్రం వాటిల్లో ఉండే పోషకాలు నశిస్తాయి. అటువంటి పండ్లను తిన్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి రిఫ్రిజిరేట్ చేసినటువంటి ఈ పండ్లను తినకూడదు. సాధ్యమైనంత వరకు ఈ పండ్లను ఫ్రిజ్లో పెట్టకుండా ఉంటేనే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications