Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎండుచేపలు, పచ్చి చేపలు..ఏవి మంచివి?

చాలామంది చేపలను ఇష్టంగా తింటారు. చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చేపలలో ఎండు చేపలు, పచ్చి చేపలు అనే రెండు రకాలు ఉంటాయి. అయితే ఏ చేపలు ఆరోగ్యానికి ఎక్కువ మంచిది? ఎండు చేపలు తింటే మంచిదా? పచ్చి చేపలు తింటే మంచిదా? అనే ప్రశ్నలు చాలామందికి ఉత్పన్నమవుతుంటాయి. ప్రస్తుతం మనం ఏ చేపలు తింటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

ఎండు చేపలు తినేవారి శాతం ఇంతే
ఎండు చేపలు, పచ్చి చేపలలో ఏ చేపలు తిన్నా మంచిదే. అయితే భారతదేశంలో చాలా మంది చేపలు తినే అలవాటు ఉన్నవారిలో 90 శాతం మంది పచ్చి చేపలు తింటే, 10 శాతం మంది మాత్రమే ఎండు చేపలు తింటారు. ఎండు చేపల నుంచి వచ్చే వాసన చాలామంది ఇష్టపడరు. ఈ కారణంగానే చాలామంది ఎండి చేపల కంటే పచ్చి చేపలను ఇష్టంగా తింటారు.

Dried fish or raw fish which is better dried fish is better and people is konw about the dried fish which has full of nutrients

పచ్చి చేపల కంటే ఎండు చేపలలో ప్రోటీన్ అధికం
ఇక ఎండు చేపలు, పచ్చి చేపలలో ఒకే తరహా పోషకాలు ఉంటాయి. కాకపోతే పచ్చి చేపలలో 18 నుండి 20 శాతం ప్రోటీన్ ఉంటే ఎండు చేపలు 60 శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది. పచ్చి చేపలలో 60 శాతం నుంచి 80 శాతం వరకు నీరు ఉంటుంది. ఈ నీటి శాతం ఎక్కువగా ఉన్న కారణంగా పచ్చి చేపలు త్వరగా పాడవుతాయి.

ఎండు చేపలలో పచ్చి చేపలలో కంటే 600గ్రాముల ప్రోటీన్
ఇక ఎండు చేపలలో నీరు ఎక్కువగా ఉండదు, కాబట్టి ఎండు చేపలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. ఆరు నెలల పాటు ఎండు చేపలను నిలువ చేసుకోవచ్చు. అలా నిల్వ చేసినప్పటికీ ఎండు చేపల రుచిలో ఏమాత్రం తేడా రాదు. ఒక కేజీ పచ్చి చేపలో 200 గ్రాముల ప్రోటీన్ లభిస్తే, ఒక కేజీ ఎండు చేపల 600 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.

రెండు చేపలలోనూ ఫుల్ పోషకాలు
పోషకాల పరంగా చూస్తే ఎండు చేప, పచ్చి చేపల కంటే చాలా మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. ఇక ఎండు చేపలలోనూ, పచ్చి చేపలలోనూ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటు, విటమిన్ ఏ, విటమిన్-డి, విటమిన్ కె, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు జింక్, మెగ్నీషియం, క్యాల్షియం, రాగి ,అయోడిన్, సెలీనియం వంటి పోషకాలు కూడా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+