పరగడుపున ఇవి తాగితే ఆరోగ్యమస్తు!
ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలామంది నీళ్లను తాగుతూ ఉంటారు. కొంతమంది వేడి నీళ్లలో తేనె వేసుకుని తాగితే, కొంతమంది నిమ్మరసం తేనె కలుపుకొని వేడి నీళ్లను తాగుతూ ఉంటారు. అయితే నిమ్మరసం తేనే మాత్రమే కాదు, ఉదయాన్నే లేవగానే తాగే కొన్ని రకాల పదార్థాలతో తయారుచేసిన నీళ్లు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
పసుపు నీళ్ళతో బోలెడు ప్రయోజనాలు
అయితే అటువంటి నీళ్లలో పసుపు నీళ్లు ఒకటి. ప్రతిరోజు పొద్దున్నే ఖాళీ కడుపుతో ఒక చిటికెడు పసుపు కలిపిన నీళ్లను తాగితే శరీరం మొత్తం డిటాక్సి ఫై అవుతుంది. పసుపులో ఉండే సమ్మేళనాలు, ఔషధ గుణాలు, మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా పసుపు నీళ్లు ఎంతగానో దోహదం చేస్తాయి.

నొప్పుల నుండి ఉపశమనం
శరీరంలో అదనంగా కొవ్వు పేరుకుపోకుండా పసుపు నీళ్లు అడ్డుకుంటాయి. పసుపులో ఉండే ఔషధ గుణాల కారణంగా ఉదయాన్నే పసుపు నీరు తాగితే ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పసుపు నీళ్లలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన శరీర ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
క్యాన్సర్ కు చెక్ పెట్టే పసుపు నీళ్ళు
ప్రతిరోజు పొద్దున్నే పసుపు నీళ్లను తాగితే శరీరంలో ఉన్న మలినాలు బయటకు పోయి శరీరం హైడ్రేటెడ్ గా మారుతుంది. పసుపు నీళ్లు కాలేయం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాదు పసుపు నీళ్లు క్యాన్సర్ కూడా అడ్డుకుంటాయి. పసుపులోని కర్కుమిన్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీరకణాలను రక్షిస్తుంది. క్యాన్సర్ కు వ్యతిరేకంగా పసుపు నీళ్లు పోరాటం చేస్తాయి.
అధిక బరువును తగ్గించే పసుపు నీళ్ళు
మన శరీర మెటబాలిజం ను యాక్టివ్ చేయడంతో పాటు అధిక బరువు తగ్గడానికి కూడా పసుపు నీళ్ళు ఎంతగానో దోహదం చేస్తాయి. అంతేకాదు ఉదయాన్నే పరగడుపున పసుపు నీళ్లు తాగడం వల్ల దీనిలో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం మన రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ ను నియంత్రించి డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు హైబీపీని కూడా తగ్గించే గొప్ప గుణాలు పసుపులో ఉన్నాయి.
అయితే అతిగా తీసుకుంటే జరిగేదిదే
మొత్తంగా ఉదయాన్నే పరగడుపున పసుపు నీళ్లు తాగడం మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే పసుపు ఆరోగ్యాన్ని ఇస్తుందని, ఇష్టమొచ్చినంత పసుపును మనం కడుపులోకి తీసుకోవడం మాత్రం డేంజర్ అని ఏదైనా మితంగా ఉంటేనే అది సత్ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications