మీ కళ్లు తరచూ పొడిబారుతున్నాయా..? ఇలా చేయండి..!

సర్వేద్రియాణాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. మానవశరీరంలో అన్ని అవయవాల కన్నా కళ్లు చాలా ప్రధానమైనవి అని చెబుతారు. అందుకే కళ్లను మనం కాపాడుకోవాలి. అయితే ప్రస్తుతం చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ లకు, ల్యాప్ టాప్ లకు అలవాటు పడిపోయారు. డిజిటల్ స్క్రీన్ కు అలవాటు పడిపోయిన ప్రజలు కళ్లకు విశ్రాంతి నివ్వడం మానేశారు. దీంతో ఇటీవలి కాలంలో అనేకమంది కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కళ్లు తరచూ పొడిబారిపోవడం జరుగుతుంటుంది. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది..? ఎలా తగ్గించుకోవాలి..? అని వైద్యులు వివరించారు.

మన కళ్లు తరుచూ దురద పెట్టడం లేదా కంటి నుంచి నీరు కారడం, వెలుతురుని సరిగ్గా చూడలేకపోవడం.. తదితర సమస్యలు ఎదురైనప్పుడు కళ్లు పొడిబారడం అనే సమస్య ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే కళ్లపై ఉండే టియర్ ఫిల్మ్ ప్రభావితం కావడం కారణంగానే అవి పొడిబారతాయని వైద్యులు వివరిస్తున్నారు. కంటిలో ఉన్న మూడు లేయర్లలో మార్పులు వస్తే కళ్లు పొడిబారడం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ల ను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లు పొడిబారడం, దురద, నీరు కారడం, ఎర్రగా మారడం, నొప్పి అనిపించడం జరుగుతుంది. అయితే మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇస్తే ఇలా జరగదని వైద్యులు వివరిస్తున్నారు. కళ్లకు తగినంత నిద్ర అవసరం అని అభిప్రాయపడుతున్నారు. కళ్లను తడిగా ఉంచుకోవడానికి డాక్టర్లు సిఫారసు చేసిన కంటి చుక్కల్ని వాడాలని చెబుతున్నారు. అంతే కాక గోరువెచ్చని నీటితో కనురెప్పలను శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.

Dry Eyes Doctors Share Essential Precautions to Protect Your Vision

అలాగే రెటీనా, రేచీకటి, కంటి శుక్లాలు వంటి దీర్థకాలిక కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని ఆహారాలను తప్పక తీసుకోవాల్సి ఉంటుందని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యారెట్, బచ్చలికూర, కాలే, చిలకడదుంప, రెడ్ క్యాప్సికమ్, చిక్కుళ్లు , గుమ్మడికాయ, బ్రోకలీ లాంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+