టేస్టీ, స్పైసీ మటన్ కీమా.. ఇలా చేస్తే ఒక్క ముద్ద కూడా అన్నం వదలరు
మటన్ కీమా.. చాలామంది ఇష్టంగా తినే టువంటి వంటకం అయితే అటువంటి వంటకాన్ని అంతే శ్రద్ధతో చేస్తే ఒక్క ముద్ద కూడా అన్నం మిగల్చకుండా తినేస్తారు. మటన్ కీమా కర్రీ తెలంగాణ స్టైల్ లో ఎలా చేయాలి? దీని రుచి అమోఘంగా ఉండాలంటే మసాలా విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ఉంటే ఇది బాగుంటుంది అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
మటన్ కీమా తయారీకి కావలసిన పదార్థాలు
మటన్ కీమా- అరకిలో
ఉల్లిపాయలు- రెండు సన్నగా తరిగిన ముక్కలు
పచ్చిమిరపకాయలు- నాలుగు సన్నగా తరిగిన ముక్కలు
కొత్తిమీర- కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూను
లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, యాలకులతో గరం మసాలా- హాఫ్ స్పూను
పసుపు- అర స్పూను
ఉప్పు- రెండు స్పూన్లు రుచికి తగినంత
కారం - రెండు స్పూన్లు రుచికి తగినంత
ధనియాల పొడి- ఒక స్పూను
నూనె- మూడు స్పూన్లు

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని మూడు స్పూన్ల నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయముక్కలు, పచ్చి మిరపకాయల ముక్కలు వేసి మగ్గనివాలి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత మటన్ కీమా అందులో వేసి అర స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివాలి.
రుచికరమైన మటన్ కీమా రెడీ
అందులో స్పూన్ గరం మసాలా వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చే దాకా ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ విజిల్ వదిలిన తర్వాత మూత తీసి అందులో ధనియాల పొడి, కొత్తిమీర వేసి కాసేపు ఉడకనివ్వాలి. అంతే రుచికరమైన మటన్ కీమా రెడీ అవుతుంది. ఈ మటన్ కీమా మనకు అన్నంలో కానీ, రోటీ, చపాతీ, పూరీలలో కానీ తింటే బాగుంటుంది.












Click it and Unblock the Notifications