పరగడుపున ఉసిరి.. ఆరోగ్యాల సిరి.. తెలుసుకోండి!
చలికాలంలో ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. అంతేకాదు ఉసిరిలో అనేక అనారోగ్యాలను తగ్గించడానికి దోహదం చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆయుర్వేదంలో ఉసిరికి ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. ఉసిరి మన ఆరోగ్యానికి సిరి అని చెప్పొచ్చు. అయితే ఈ సీజన్లో ఉసిరిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
ఉసిరిలో ఫుల్ పోషకాలు
అయితే ప్రతిరోజు ఉదయం పరగడుపున ఉసిరి తినడం మరింత ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని చెబుతారు.
ఉసిరిపండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఉసిరిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ బి వన్, విటమిన్ ఈ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలు
ఉసిరిలో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి మనకు అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తాయి. ఉసిరి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాదు మన గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయం పడుతుంది. ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది. ఇది మన రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఉసిరితో చర్మ ఆరోగ్యం.. వృద్ధాప్యమిక ఆలస్యం
ఉసిరి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన శరీరంలో కొలాజిన్ ఉత్పత్తికి ఉసిరి దోహదం చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. మన జీర్ణ ప్రక్రియకు ఉసిరి దోహదం చేస్తుంది. జుట్టును బలోపేతం చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని ఉసిరి నివారిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. డయాబెటిస్ కంట్రోల్ లో ఉండేలా చూస్తుంది.
ఉసిరితో కీళ్ళ నొప్పులకు చెక్, కిడ్నీలకు ఆరోగ్యం... ఇంకా ఎన్నో
మన మూత్రపిండాల ఆరోగ్యానికి ఉసిరి ఎంతగానో దోహదం చేస్తుంది. ఒబేసిటీతో బాధపడుతున్న వారికి బరువు తగ్గేందుకు ఉసిరి దోహదం చేస్తుంది. ఉసిరి మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన శరీరంలో కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
ఉసిరితో మెదడు ఆరోగ్యం
ఉసిరి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మన జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కనుక ఈ సీజన్ లో దొరికే ఉసిరిని తినటం అస్సలు మిస్ చేసుకోవద్దు..
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications