బొబ్బర్లు ఆహారంగా తింటే ఏం జరుగుతుందో తెలుసా!

ఆరోగ్యమే మహా భాగ్యం... ఆరోగ్యం లేకుండా ఎన్ని ఆస్తులు ఉన్నా వ్యర్ధమే. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావించేవారు ఆహారంపై తగిన శ్రద్ధ పెట్టాలి. ప్రోటీన్ పుష్కలంగా ఉండే పప్పులను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలాంటి వాటిలో బొబ్బర్లు ఒకటి. బొబ్బర్లు మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే పప్పు దినుసుల్లో బొబ్బర్లు కూడా ముఖ్యమైనవి .

బొబ్బర్లతో ఆరోగ్యం
బొబ్బర్లను మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా బొబ్బర్లను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఒబేసిటీని తగ్గించవచ్చు. బొబ్బర్ల లో ఉండే పోషకాలు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యల నుండి కూడా రక్షణ కల్పిస్తాయి. బొబ్బర్లలో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ తదితర పోషకాలు ఉంటాయి.

Eat bobbarlu in food see the miracles on your health mainly in weight

బరువును, డయాబెటిస్ ను తగ్గించే బొబ్బర్లు
బొబ్బర్లలో పరిమిత క్యాలరీలు, కొవ్వులు, అధిక పీచు పదార్థం ఉంటుంది. ఇవి అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన బొబ్బర్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా ఉపయోగకరం. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతాయి.

గుండె జబ్బులు రాకుండా చేసే బొబ్బర్లు
బొబ్బర్ల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మన శరీరంలోని పోషకాహార లోపాన్ని నివారిస్తాయి. శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి. బొబ్బర్లు రక్తంలో ఉన్న ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించి గుండెజబ్బులు రాకుండా చేస్తాయి. బొబ్బర్లు తినడం వల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుండి మనకు రక్షణ కలుగుతుంది. బొబ్బర్ల లో ఉండే ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, మినరల్స్ మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

చర్మ ఆరోగ్యానికి బెస్ట్
బొబ్బర్లలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. బొబ్బర్లు మలబద్దకాన్ని తగ్గించి మన జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. బొబ్బర్లు తింటే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బొబ్బర్లలో ఉండే అధిక ప్రోటీన్ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే బొబ్బర్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్య సంరక్షణ జరుగుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+