40 ఏళ్ళు దాటినా బరువు పెరగకుండా ఉండాలంటే ఇవి తినండి!
40 సంవత్సరాలు దాటిన తర్వాత మానవ శరీరంలో మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా మహిళలలో అయితే జీవన విధానంలో మార్పుల వల్ల కానీ బరువు పెరుగుతూ ఉంటారు. సరైన శారీరక వ్యాయామ లేకపోవడం, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల ఈ వయసులో అనేక అనారోగ్య సమస్యలు మహిళలను వేధిస్తాయి. అయితే 40సంవత్సరాల వయసులో ఆహారంపైన సరైన దృష్టి పెట్టి ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.
40 ఏళ్ళ తర్వాత మహిళల ఆరోగ్యంలో మార్పులు
40 ఏళ్ల తర్వాత తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటి? ముఖ్యంగా మహిళలు ఎటువంటి ఆహారాన్ని తింటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందో ప్రస్తుతం తెలుసుకుందాం. 40 ఏళ్లు దాటిన తర్వాత హార్మోన్లు నిదానంగా తగ్గుతూ వస్తాయి. ఈ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. నిద్రలో చెమటలు పట్టి ఉన్నట్టుండి మెలకువ వస్తుంది. ఈ విధంగా తరచూ జరగడం వల్ల మహిళల దినచర్యపైన ప్రభావం పడుతుంది.

40 ఏళ్ళు దాటాక ఇవి తప్పక తినాలి
విపరీతమైన చిరాకు, కోపం, అసహనం వంటివి ఈ వయసులో మహిళలకు సర్వసాధారణంగా వస్తాయి. ఇక ఈ సమస్యలను అధిగమించడానికి ముఖ్యంగా ఆహారం పైన శ్రద్ధ వహించాలి. 40సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు ఎక్కువగా పండ్లు తినాలి. నారింజ, ద్రాక్ష, బత్తాయి వంటి పండ్లలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి తదితర పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి.
సబ్జా గింజలు ఆహారంలో తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్
శారీరక బరువును నియంత్రించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. చర్మ ఆరోగ్యానికి కూడా ఈ ఆహారాలు ఎంతగానో దోహదం చేస్తాయి. 40 ఏళ్ల వయసు దాటిన మహిళలు ప్రతిరోజు సబ్జా గింజలను తీసుకోవడం ఎంతో మంచిది. సబ్జా గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మహిళల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
ఎగ్స్ తో మహిళలకు ఆరోగ్యం
క్రమం తప్పకుండా కోడిగుడ్లు తినడం కూడా మహిళలకు ఎంతో మంచిది. ఎగ్స్ లో ఉన్న ప్రోటీన్లు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతాయి. అందుకే మహిళలు 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన పేర్కొన్న ఆహారాలను తీసుకుంటే ఖచ్చితంగా మన శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications