ఎండు చేపలు తింటున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!!

చాలామంది ఎండు చేపలు తినడానికి తెగ బాధపడుతూ ఉంటారు. ఎండు చేపల వాసన ఎక్కువగా ఉండటం వల్ల వాటిని తినడానికి విముఖత చూపిస్తారు. పచ్చి చేపలను తినే చాలా మంది ఎండు చేపలను మాత్రం తినటానికి నో అంటారు. అయితే ఎండు చేపలను తినే వాళ్ళు మాత్రం వాటిని చాలా ఇష్టంగా తింటారు. వాటి రుచి తింటేనే తెలుస్తుంది అని చెప్తారు.

ఎండు చేపలలో బోలెడు పోషకాలు
అయితే ఎండు చేపలలో బోలెడు పోషకాలు ఉంటాయని, ఎండు చేపలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పొచ్చు . ప్రస్తుతం మనం ఎండు చేపలను తినడం వల్ల కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం. ఎండు చేపలలో పోషకాల విషయానికి వస్తే ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, విటమిన్ బి12, సంతృప్త కొవ్వు ఆమ్లాలు, సోడియం ఉంటాయి.

Eating dry fish Must Know These facts and benefits about dry fish eating

ఎండు చేపలు తింటే నరాల, కండరాల సమస్యలకు చెక్
ఎండు చేపలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎండు చేపల లో ఉండే పోషకాల కారణంగా శరీరం పొడిబారకుండా ఉంటుంది. ఎండు చేపలు నరాల సమస్యలను నివారించడానికి బాగా పనిచేస్తాయి. కండరాల నిర్మాణానికి ఎండు చేపలు దోహదం చేస్తాయి. ఎండు చేపలు మన రక్తపోటును కూడా నియంత్రిస్తాయి.

చెడు కొలెస్ట్రాల్ కు చెక్.. ఎముకలకు పుష్టి
ఎండు చేపలలో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. ఎండు చేపలలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఎండు చేపలలో పాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఇవి మన శరీరంలోని ఎముకలకు పుష్టిని అందిస్తాయి.

వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఎండు చేపలు
ఎండు చేపలను తింటే దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దంతాలు బలోపేతం అవుతాయి. ఎండు చేపలలో ఉండే విటమిన్ బి 12 శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కేవలం వాసనను బట్టి ఎండు చేపలను తినకుండా ఉండొద్దు. ఎన్నో పోషకాలు కలిగి ఉండి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే ఎండు చేపలను ఆహారంలో భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+