జున్ను తింటున్నారా? అయితే శరీరంలో కలిగే మార్పులు తప్పక తెలుసుకోండి!
జున్ను.. చాలామంది దీనిని ఇష్టపడతారు. జున్ను ప్రతిరోజు దొరికే పదార్థం కాదు, చాలా అరుదుగా దొరికే ఒక పాల ఉత్పత్తి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది జున్నును అమితంగా ఇష్టపడతారు. పశువులు ఈనిన తర్వాత తొలి రోజులలో వచ్చే ముర్రు పాలే జున్నుపాలుగా చెబుతారు. జున్నును రకరకాలుగా ఉండవచ్చు.
జున్నుతో ఆరోగ్య ప్రయోజనాలు
రకరకాల రుచులతో జున్ను తయారు చేసుకోవచ్చు. నేరుగా గేదె నుంచి వచ్చిన పాలతో తయారు చేసిన జున్ను కాకుండా మార్కెట్లో ఆర్టిఫిషియల్ గా చైనా గ్రాస్ తో తయారు చేస్తున్న జున్ను కూడా దొరుకుతుంది. అయితే పాల నుంచి తయారు చేసే జున్ను చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని చెబుతారు.

జున్ను తింటే ఈ బెనిఫిట్స్
జున్నులో మన ఆరోగ్యానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా జున్నులో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ బి12, రిబో ఫ్లావిన్, జింక్, ప్రోటీన్ వంటివి అధికంగా ఉంటాయి. జున్ను ని తీసుకోవడం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతారు. జున్ను లో ఉండే పోషకాల కారణంగా ఎముకలు బలంగా ఉంటాయని, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు.
కండరాలకు జున్ను చేసేను మేలు
జున్ను తీసుకోవడం వల్ల శరీరకణాల నిర్మాణం, మరమ్మతుకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. అంతే కాదు జున్నులో మన గాయాలను త్వరగా మాన్పించే గొప్ప గుణాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.. జున్ను మనం తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి అని, మంచి పోష కాలతో నిండిన ఈ ఆహారాన్ని మితంగా తీసుకుంటే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
శరీరానికి శక్తిని ఇచ్చే జున్ను
జున్ను తిన్నవారిలో దగ్గు, జలుబు వంటి ఇతర అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. జున్నులో ఉండే ప్రోటీన్ కంటెంట్ శరీరానికి శక్తిని అందిస్తుంది. దీని కారణంగా నీరసం, అలసట వంటి సమస్యల భారి నుండి రక్షించబడుతుంది. జున్నులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మనలను మానసికంగా ధైర్యంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు.
మితంగానే జున్ను
ఇక రక్త కణాల ఉత్పత్తికి నరాల ఆరోగ్యానికి కూడా జున్ను ఎంతో దోహదం చేస్తుందని చెబుతున్నారు. జున్ను లో ఉండే ఈ గొప్ప గుణాలను గుర్తు పెట్టుకొని, అప్పుడప్పుడు దీనిని తినడం మంచిదని అయితే ఎప్పుడు తిన్నా మితంగానే తినాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications