మోమోస్ తింటున్నారా... అయితే ఇవి తప్పక తెలుసుకోండి

ఇటీవల కాలంలో బయట స్ట్రీట్ ఫుడ్స్ లో ఎక్కువగా దొరుకుతున్న వాటిలో మోమోస్ ఒకటి. ఏంటీ మోమోస్? దీనిని ఎలా తయారు చేస్తారు? ఇది తింటే మంచిదేనా.. ఇది తింటే మన శరీరంలో మన ఆరోగ్యంలో వచ్చే మార్పులు ఏమిటి? వంటి అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మోమోస్ తినటానికి యూత్ మొగ్గు
ఇటీవల కాలంలో ముఖ్యంగా యూత్ మోమోస్ తినడానికి తెగ ఇష్టపడుతున్నారు. అయితే తరచూ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ మోమోస్ ను మైదా పిండితో తయారు చేస్తారు. అంతే కాదు దీనిని తయారు చేయడానికి అజినమోటోను లేదా ఎంఎస్జీని వాడుతారు. ఉడికించిన కూరగాయలను లేదా చికెన్ ను మైదాపిండి మధ్యలో పెట్టి దానిని గుండ్రంగా చుట్టి ఆవిరి మీద ఉడికిస్తారు.

eating momos is life threatening Don t eat this street food

మోమోస్ తో రోగాలెన్నో
ఈ ఉడికించిన మొమోస్ ను రకరకాల చట్నీలతో టేస్టీగా ఉండేలా వడ్డిస్తారు. అయితే మోమోస్ తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మోమోస్ బరువును విపరీతంగా పెంచుతుంది. గుండె జబ్బులకు కారణమవుతుంది. అధిక రక్తపోటు సమస్యలను సృష్టిస్తుంది. మధుమేహ వ్యాధిని పెంచుతుంది. మొమోస్ ను రిఫైన్డ్ పిండితో తయారు చేయడం వల్ల ఇది రక్తంలో చెక్కర స్థాయిలను గణనీయంగా పెంచుతుంది.

మైదాతో తయారుచేసిన ఏ పదార్ధం మంచిది కాదు
మధుమేహం ఉన్నవారికి మొమోస్ తినడం చాలా హానికరం. అంతేకాదు మోమోస్ తరచూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బ తింటుంది. ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. మలబద్ధకం, కడుపుబ్బరం వంటి అనేక సమస్యలు వస్తాయి. అసలు మైదాతో తయారు చేసిన ఏ పదార్థమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవి కాదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవలసినటువంటి అంశం.

మోమోస్ తినడం డేంజర్ అంటున్న డైటీషియన్స్
అజినమోటోను మొమోస్ తయారీలో ఉపయోగించడం వల్ల ఇది క్యాన్సర్ కారకంగా కూడా మారే అవకాశం ఉంది. అనారోగ్యకరమైన కొవ్వులతోనూ, మైదాతోను తయారు చేసే ఈ మోమోస్ తినడం ఏ మాత్రం మంచిది కాదని డైటీషియన్లు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్ట్రీట్ ఫుడ్ లో విపరీతంగా విక్రయిస్తున్న ఈ మోమోస్ ను తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+