ఈ ఆహారాలు తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది!
ప్రస్తుతం సమాజంలో ఎక్కువ శాతం ప్రజలు ఫేస్ చేస్తున్న అతిపెద్ద అనారోగ్య సమస్య చెడు కొలెస్ట్రాల్. శరీరంలో అధికస్థాయిలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రస్తుత కాలంలో ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు దానిని నియంత్రణలోకి తీసుకురావడానికి తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాన్ని తినడం, కొలెస్ట్రాల్ ని పెంచే ఆహారాన్ని నియంత్రించడం అలవాటు చేసుకోవాలి.
చెడు కొలెస్ట్రాల్ నియంత్రించే ఆహారం
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం కోసం మనం వేటిని ఆహారంగా తీసుకోవాలి అంటే.. చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం మనం పండ్లను ఎక్కువగా మన ఆహారంలో భాగం చేసుకోవాలి. నూనెతో తయారుచేసిన ఆహార పదార్థాలను తినకూడదు. బొప్పాయి, జామ, ఆపిల్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, అవకాడో వంటి పండ్లను తీసుకోవడం వల్ల ఆ పండ్లు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెరగకుండా నియంత్రిస్తాయి.

వీటితో చెడు కొలెస్ట్రాల్ కు చెక్
మనం తీసుకునే ఆహారంలో ఓట్స్ కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఓట్ మీల్ ను అల్పాహారంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాదు ఇన్సులిన్ నిరోధకత కూడా మెరుగుపడుతుంది. ఇక గ్రీన్ టీ ని తీసుకోవడం వల్ల ఇది శరీరంలోని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కొత్తిమీర, మెంతికూర వంటి వాటిలో కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు ఉంటాయి.
తృణధాన్యాలతోనూ చెడు కొలెస్ట్రాల్ సమస్య దూరం
ఇక మనం ఆహారంలో భాగంగా తృణధాన్యాలను తీసుకుంటే కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్ అవకాడోలో అధికంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. బీన్స్, బ్రోకలీ, లీఫ్ క్యాబేజ్, పాలకూర కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
ఆహారంలో ఇవి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ మాయం
బాదంపప్పు, వాల్ నట్స్, అవిసె గింజలు మరియు చియాగింజలలోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించి, హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. కనుక చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే పైన పేర్కొన్న ఆహారాలను మీ డైట్ లో భాగంగా చేసుకోండి. తప్పనిసరిగా చెడు కొలెస్ట్రాల్ తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications