ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా? క్యాన్సర్‌తో పాటు ఆ రోగాలకు ఛాన్స్!!
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వంట వండుతున్నారా? ఆ అన్నాన్ని తినడం యమ డేంజర్ అంటున్నారు వైద్య నిపుణులు. ఇటీవల కాలంలో చాలామంది అన్నాన్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లోనే వండుతున్నారు. పట్టణాలలోని కాదు పల్లెలకు కూడా ఇది విస్తరించింది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన ఆహారం తింటే అనేక అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండితే అనారోగ్యాలు
ముఖ్యంగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల చిన్న వయసులోనే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండినటువంటి అన్నంలో పోషకాలు మాయమవుతాయని, వంట చేసే సమయంలో అందులోనుండి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయని చెబుతున్నారు. ఇక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తిన్న వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

నాన్ స్టిక్ కోటింగ్ రైస్ కుక్కర్లతో యమా డేంజర్
వంటల్లో అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిదని, మరీ ముఖ్యంగా నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కంటే ప్రెషర్ కుక్కర్ ఎంతో మేలని చెబుతున్నారు. ఒకవేళ అన్నం త్వరగా వండాలి అంటే ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. కరెంట్ ఆధారంగా ఉడికినటువంటి అన్నాన్ని తినకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు. మట్టి పాత్రలు, స్టీలు పాత్రలలో వండుకుని తినడం మంచిదని చెబుతున్నారు. మట్టి పాత్రలో వండుకుని తినడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచినిస్తాయని చెబుతున్నారు.

ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండితే పోషకాలు ఉంటాయా?
ప్రెషర్ కుక్కర్ లో అన్నం ఉడికించడం వల్ల కూడా ఆహారంలో పోషకాలు ఉంటాయని, కానీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో ఉడికించడం వల్ల ఆహారంలో ఉన్న పోషకాలన్నీ నిశిస్తాయని చెబుతున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో ఉడికించిన ఆహారాన్ని తింటే అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్లకు గుడ్ బై చెప్పి అన్నం నేరుగా స్టవ్ మీద వండుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications