అంజీర పండ్లతో అంతులేని ఆరోగ్యం.. తప్పక తెలుసుకోండి!

ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పండ్లు ఎంతగా దోహదం చేస్తాయో మనకందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఏ సీజన్లో లభించే పండ్లను ఆ సీజన్ లో తినడంతో పాటు తప్పనిసరిగా తినాల్సిన కొన్ని పండ్లు ఉన్నాయి. ఇక అటువంటి పండ్లలో అంజీర పండ్లు ఒకటి.

అంజీర పండ్లతో ఆరోగ్యం
అంజీర పండ్లలో విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు, ఫైబర్ ఇలా మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అటువంటి అంజీర పండ్లను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. మన శరీరం ఉత్సాహంగా ఉంటుంది. అంజీర పండ్లను నీళ్లలో నానబెట్టుకుని తింటే ఎంతో ఆరోగ్యం వస్తుంది.

Endless health benefits with figs must know about anjeer

అంజీర పండ్లతో బరువుకు చెక్
ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే నానబెట్టుకున్న అంజీర పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
అంజీర పండ్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంజీర పండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. మూలశంఖ వంటి వ్యాధులను నయం చేస్తాయి. మనం బరువు తగ్గడానికి, మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి అంజీర పండ్లు ఎంతగానో పనిచేస్తాయి.

హైబీపీ, డయాబెటిస్ కు అంజీరా పండ్లు
అంజీర పండ్లు తినడం వల్ల బరువు అదుపులోకి వస్తుంది. హై బీపీ తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం అంజీర పండ్లను తినవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు అంజీర పండ్లను ప్రతిరోజు తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. గుండె సంబంధిత వ్యాధులకు, నెలసరి సమస్యలకు, కిడ్నీ సమస్యలకు అంజీర పండ్లు ఎంతో బాగా పనిచేస్తాయి.

ఆడవారికి, మగవారికి సంతానలేమి సమస్యను తగ్గించే అంజీరా
అంజీరా పండ్లు రక్తహీనతను తగ్గించి శరీరాన్ని నిత్యం ఉత్సాహంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. సంతానలేమి సమస్యతో బాధపడేవారు అంజీర పండ్లు తింటే మంచిది.అంజీర పండ్లు తినడం వల్ల పురుషులలో వీర్యం వృద్ధి జరుగుతుంది. స్త్రీలలో అండోత్పత్తి సమస్యలు తగ్గుతాయి. ఇక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అంజీర పండ్లను మనం ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+