విపరీతంగా జుట్టు రాలుతుందా? అయితే ఈ రెమిడీస్ ట్రై చెయ్యండి!
జుట్టు మనిషి అందాన్ని మరింత ఇనుమడింప చేస్తుంది. అటువంటి జుట్టు రాలిపోతున్న సమస్య ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఎవరు చూసినా జుట్టు రాలిపోతోందని తెగ బాధపడుతున్నారు. జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు? ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తున్నాయి.
జుట్టు రాలటానికి అనేక కారణాలు
అయితే జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి జుట్టు రాలడానికి ముఖ్యమైన కారణం. అంతేకాదు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న, జన్యుపరమైనటువంటి కారణాలు ఉన్న, హార్మోన్లలో అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ల లోపం, ఐరన్ లోపం వంటి సమస్యలు ఉన్న జుట్టు రాలిపోతుంది. కొన్ని రకాల మందులను వినియోగించే వారికి కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది.

జుట్టు రాలే సమస్య నివారణలు
జుట్టు రాలిపోతున్న సమస్యను నివారించడం కోసం చాలామంది రకరకాల నూనెలను వాడుతూ ఉంటారు. అయితే నూనెలకు బదులుగా జుట్టు రాలే సమస్యను నివారించడానికి మంచి ఆహారం తీసుకోవడం అవసరం. ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. కొబ్బరి నూనె, బాదం నూనె వంటి నూనెలతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలే సమస్య నివారణ అవుతుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఈ విషయాల్లో జుట్టు ఆరోగ్యం కోసం జాగ్రత్త
యోగా, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా కూడా జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. మనం ఉపయోగించే సబ్బులు, షాంపూల వల్ల కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది కాబట్టి, వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఎంపిక చేసుకొని జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇక జుట్టు స్ట్రెయిటనింగ, కర్లింగ్ వంటి చర్యలతో కూడా జుట్టుకు హాని కలుగుతుంది.
వీటితో జుట్టు రాలే సమస్య నుండి ఉపశమనం
ఇంట్లోనే సహజసిద్ధమైన ఉల్లి రసాన్ని, తలకు బాగా పట్టించి 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే జుట్టు రాలడం తగ్గి, మళ్లీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అదేవిధంగా బియ్యం కడిగిన నీళ్లను తలకు బాగా పట్టించి, 15 నిమిషాల తర్వాత జుట్టు కడుక్కుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications