Helth Tips: గర్భణీలు కోడి గుడ్లు తినొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..!
మనం త్వరగా కర్రీ చేసుకోవాలంటే.. ఏం చేస్తాం.. గుడ్లు తీసుకొచ్చి.. కర్రీ చేసుకుంటాం. ఎందుకంటే ఎగ్ కర్రీ త్వరగా చేసుకోవచ్చు. అయితే ఈ కోడి గుడ్డులో అధిక ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అయితే ప్రై ఎగ్ కంటే ఉడకబెట్టిన గుడ్డు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

రోజుకొక ఉడకబెట్టిన గుడ్డు
నూనెలో వేయించుకుని తినడం కంటే పోషకాలు పొందాలంటే ఉడకబెట్టినవి మాత్రమే తినాలని సూచిస్తున్నారు.
శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలంటే రోజుకొక ఉడకబెట్టిన గుడ్డు తింటే సరిపోతుందట. ఒక రోజులో ఎక్కువ గుడ్లు తింటే శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంది. మరి గర్భిణీలు కోడి గుడ్డు తినొచ్చా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి.

విటమిన్ బి 12
గర్భిణీలు గుడ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుడ్లలో ప్రోటీన్లతో పాటుగా, విటమిన్ బి 12, ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, రాగి, మెగ్నీషియం, సెలీనియం వంటి ఎన్నో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్ని గర్భిణీలకు అవసరం కాబట్టి గుడ్లు తినాలని సూచిస్తున్నారు. అయితే గర్భిణీలు పచ్చి కోడి గుడ్లు తినొద్దని సూచిస్తున్నారు.

అనారోగ్య సమస్యలు
గర్భిణీలు గుడ్లు తినాలనుకుంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే మంచిద. ఉదయం పూట మెటబాలిజం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తినడం వల్ల అజీర్థి సమస్య వచ్చే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో గుడ్లను మోతాదుకు మించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే గుడ్లను తక్కువ మోతాదులో తీసుకోవాలి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications