హెయిర్ ఫాల్ బాధిస్తుందా? ఈ ఆహారాలతో జుట్టు రాలటం తగ్గుతుంది!

చాలామంది ప్రస్తుత కాలంలో హెయిర్ ఫాల్ సమస్యతో బాధ పడుతున్నారు. ఇక ముఖ్యంగా చలికాలంలో హెయిర్ ఫాల్ అతిపెద్ద ప్రధాన సమస్యగా మారుతుంది. హెయిర్ ఫాల్ కు అనేక కారణాలు ఉన్నాయి. విపరీతమైన ఒత్తిడి, జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు అన్ని మన జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలుగా చెబుతారు, ఇక హెయిర్ ఫాల్ అవుతుందని బాధపడేవారు హెయిర్ ఫాల్ ను తగ్గించేందుకు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే మంచిది.

జుట్టు రాలటం తగ్గాలంటే ఇవి తినండి
హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ హెయిర్ ఫాల్ ను కొంతమేరకు కంట్రోల్ చేస్తాయి. హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే మనం తీసుకోవలసిన ఆహార పదార్థాలలో క్యారెట్ ఉండేలా చూసుకోవాలి. క్యారెట్ కంటి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి క్యారెట్ ప్రతిరోజు తినేవారికి హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

Extreme hair fall in this winter These foods can reduce hair loss

వీటితో హెయిర్ ఫాల్ తగ్గుతుంది
నట్స్, సీడ్స్ తీసుకునే వారికి కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ తరచూ తీసుకుంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, జింక్ మీ జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. ఇక్కడ చిలకడదుంపలలో కూడా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడే బోలెడు పోషకాలు ఉంటాయి. చిలకడదుంపల్లో ఉండే బీటా కెరోటిన్ మన జుట్టు ఆరోగ్యంగానూ, తేమగాను ఉండేలా చేస్తుంది.

ఓట్స్, పాలకూర లతో హెయిర్ ఫాల్ కు చెక్
అంతేకాదు ఓట్స్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి మరో అద్భుతమైన పరిష్కారం. ఓట్స్ లో ఫైబర్, ఐరన్, జింక్, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి పోషకాలు ఉండడం వల్ల ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇక పాలకూరను మనం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అందులో ఉండే పోషకాలు మన హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తాయి.

ఇవి తింటే కూడా జుట్టు రాలదు
ఫోలేట్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు పాలకూరలో ఎక్కువగా ఉంటాయి. ఇవి మన జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కోడి గుడ్డులో కూడా మన జుట్టు ఆరోగ్యానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి కోడిగుడ్లలో ప్రోటీన్లు మన జుట్టు బలంగా ఉండేలా చేసే బయోటిన్ ఉత్పత్తి చేస్తాయి కనుక కోడిగుడ్లను కూడా మన ఆహారంలో భాగంగా చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు రాలడం తగ్గుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+