కళ్ళవాపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ నివారణలు మీకోసమే!
కళ్ళ చుట్టూ వాపు.. ఇది ఒక రకమైన కంటి సమస్య. ఈ సమస్యతో చాలా మంది తెగ బాధపడుతూ ఉంటారు. కళ్ళ చుట్టూ వాపు కొంతమందికి ఎక్కువగా ఉదయం నిద్ర లేచిన వెంటనే కనిపిస్తుంది. విపరీతంగా ఏడ్చిన వారికి కూడా కళ్ళ చుట్టూ వాపు రావటం మనం చాలా సందర్భాలలో గమనిస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఈ కళ్ళ చుట్టూ వాపు కొద్దిసేపటి తరువాత తగ్గిపోతే మరి కొంతమందికి ఎక్కువసేపు కళ్ళ చుట్టూ వాపు సమస్య ఉంటుంది.
కళ్ళ చుట్టూ వాపు.. ఇదొక కారణం
ఇక అలాంటివారు కళ్ళవాపు తగ్గాలంటే ఎలాంటి చిట్కాలను పాటించాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కళ్ళ చుట్టూ వాపు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ముఖ్యంగా మంచి నిద్ర పోవాలి. కచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాల్సిన అవసరం ఉంది. అసలే నిద్ర తక్కువ పోకూడదు.

వీటితో కళ్ళవాపు తగ్గుతుంది
టీ బ్యాగ్ ను కొద్దిగా నీటితో తడిపి దానిని ఫ్రిజ్లో పెట్టి అది గడ్డ కట్టిన తర్వాత కంటి కింద పది నిమిషాలు సాధారణ ఉష్ణోగ్రత వచ్చేవరకు ఈ టీ బ్యాగ్ ఐస్ క్యూబ్ ను ఉంచితే ఈ ఐస్ క్యూబ్ తో కూడా కళ్ళ వాపు సమస్య తగ్గుతుంది. కాఫీ క్యూబ్స్ తో కళ్ళ చుట్టూ మసాజ్ చేయడం వల్ల కూడా కళ్ళ వాపు తగ్గుతుంది.
వీటిని వాడి చూడండి... కళ్ళవాపుకు చెక్
దీనికి చేయవలసింది నీటిని వేడి చేసి ఒక చెంచా కాఫీ పొడిని దానిలో వేసి మరిగించి ఆ నీరు చల్లారిన తర్వాత ఐస్ ట్రేలో పోసి భద్రపరుచుకుంటే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఆ క్యూబ్స్ తో కళ్ళ చుట్టూ నిదానంగా మసాజ్ చేస్తే కళ్ళ వాపు తగ్గుతుంది.ఒక కీర దోసకాయ ముక్కను కానీ బంగాళాదుంపని గాని కట్ చేసి కళ్ళ పైన కాసేపు పెట్టుకుంటే వాపు సమస్య తగ్గుతుంది.
ఉప్పు తగ్గించండి
చాలామంది ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకుంటూ ఉంటారు. ఉప్పు ఆహారంలో ఎక్కువ తీసుకుంటే కూడా కళ్ళ వాపులు వస్తాయి. అందుకే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకోవాలి. దూదిని చల్లని పాలల్లో ముంచి కళ్ళ చుట్టూ రాసుకుంటూ ఒక పది పదిహేను నిమిషాలు చేస్తే కళ్ళ వాపు సమస్య తగ్గుతుంది.
కళ్ళ వాపు ఉంటే ఈ విషయాల్లో జాగ్రత్త
అంతేకాదు కళ్ళల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కళ్ళల్లో లెన్సులు పెట్టుకోకూడదు. ఇక కొంతమంది లిక్విడ్ ఐలైనర్ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ లిక్విడ్ ఐలైనర్ వలన కూడా కళ్ళ వాపు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లిక్విడ్ ఐలైనర్ కు బదులుగా పెన్సిల్ ఐ లైనర్ ఉపయోగిస్తే కళ్ళ వాపు సమస్య తగ్గుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
గరం గరం పాయా సూప్ తీసుకోండి చాలు- ఏ పుత్తూరు కట్టూ అవసరం లేదు -
మజ్జిగలో ఇవి కలిపితే అమృతమే -
సండే స్పెషల్ "కడక్‌నాథ్ కోడి మాంసం".. నాటు కోడి కంటే బెస్ట్ టేస్ట్ ? -
వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే "వెజిటెబుల్ మజ్జిగ పులుసు" ట్రై చేస్తారా..? -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..!












Click it and Unblock the Notifications