అలసట, నీరసం, జ్వరం, నొప్పులు... అయితే నిర్లక్ష్యం చెయ్యొద్దు!
చాలామంది విపరీతమైన ఒళ్ళు నొప్పులు, నీరసం, జ్వరంతో బాధపడుతున్నారు అయితే సాధారణ జ్వరమని భావించే ఏవేవో మందులు వాడి సమస్య తీవ్రమైన తర్వాత ఆసుపత్రులకు వెళుతున్నారు. అయితే విపరీతమైన ఒళ్ళు నొప్పులు, నీరసం జ్వరంతో బాధపడేవారు. ప్రతిరోజు ఒకే సమయంలో జ్వరం వస్తూ బాధపడేవారు ఆ జ్వరాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకొని అది ఎటువంటి జ్వరమో నిర్ధారించుకున్న తర్వాత వైద్య సేవలు చేయించుకోవాలి.
టైఫాయిడ్ తో అనేక అనారోగ్య సమస్యలు
ఇక కలుషితమైన ఆహారం కారణంగా కలుషితమైన నీటి కారణంగా చాలామంది టైఫాయిడ్ బారిన పడుతున్నారు. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఆహారం లేదా నీటి ద్వారా కడుపులోకి చేరుతుంది .ఇది ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ఆ తర్వాత అది శరీరంలో రకరకాల ఇబ్బందులకు అనారోగ్యానికి కారణం అవుతుంది.

కడుపునొప్పి బాధిస్తుందా?
ఇక టైఫాయిడ్ బారిన పడిన వారిలో సాధారణ లక్షణాలలో కడుపునొప్పి ఒకటి. టైఫాయిడ్ బారిన పడినవారు కడుపు నొప్పితో బాధపడతారు. ఇది వారి మొత్తం జీర్ణ ప్రక్రియను పాడుచేస్తుంది. దీంతో ఏం తిన్న తేలికగా జీర్ణం కాక కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఈ నొప్పి నిరంతరం ఇబ్బంది పెడుతుంది. టైఫాయిడ్ తో బాధపడేవారు ఒళ్ళు నొప్పులతో బాధపడతారు. విపరీతంగా కడుపునొప్పి బాధిస్తుంటే అది టైఫాయిడ్ గా గుర్తించాలి.
తలనొప్పితో బాధ పడుతున్నారా ?
శరీరంలో రోగనిరోధక వ్యవస్థపైన వివిధ శరీర భాగాలపైన టైఫాయిడ్ ప్రభావం ఉంటుంది. తలనొప్పి తో బాధపడుతుంటే టైఫాయిడ్ లక్షణంగా గుర్తించాలి. విపరీతమైన తలనొప్పితో బాధపడే వారు, శరీరం బలహీనంగా మారిన వారు టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టుగా గుర్తించాలి. అంతేకాదు టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బయట జ్వరం లేనట్టు అనిపించినా, లోలోపల జ్వరం ఉంటుంది. ఈ జ్వరం చాలాకాలం పాటు ఉంటుంది. జ్వరం వల్ల విపరీతమైన అలసట వస్తుంది.
కీళ్ళ నొప్పులు, వికారం, వాంతులు అవుతున్నాయా?
కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. బయట శరీరాన్ని స్పర్శించినప్పుడు జ్వరం లేనట్టుగా అనిపిస్తుంది కానీ దాని ప్రభావం ఒంటిపైన కచ్చితంగా ఉంటుంది. ఇక వికారము, వాంతులు వంటి లక్షణాలు కూడా టైఫాయిడ్ లో భాగంగానే ఉంటాయని చెబుతున్నారు. దీని కారణంగా శరీరం నిర్జలీకరణం ప్రారంభిస్తుంది. టైఫాయిడ్ లక్షణాలు మరింత తీవ్రంగా మారే అవకాశం కూడా ఉంటుంది. వైడల్ పరీక్ష చేయించుకోవడం ద్వారా టైఫాయిడ్ అని గుర్తిస్తే అది పూర్తిగా తగ్గేవరకు వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications