మహిళల్లో ఫ్యాటీ లివర్ సమస్య... ఈ లక్షణాలుంటే అలెర్ట్!

మనిషి శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. కాలేయం మన జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు రక్తాన్ని శుద్ధిచేసి మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుంది. మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా కాలేయమే కీలకం. అటువంటి కాలేయం ప్రస్తుతం ప్రమాదంలో పడుతుంది. మన సొసైటీలో కాలేయ సమస్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

మహిళల్లో ఫ్యాటీ లివర్ సమస్య
ముఖ్యంగా మహిళల్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్ తోపాటు లివర్ సిర్రోసిస్, లివర్ ఇన్ఫెక్షన్, లివర్ ఫెయిల్యూర్ వంటి అనేక సమస్యలు కూడా ప్రస్తుతం మహిళలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఈ ఫ్యాటీ లివర్ సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనబడతాయి. ఆ లక్షణాలు కనబడితే మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. తక్షణం వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Fatty liver problem in women alert with these symptoms

బాగా అలసిపోతున్నారా?
మరి ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారికి కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు చిన్న చిన్న పనులకే అలసిపోతారు. చిన్న పని చేసినా అలసిపోయినట్టుగా భావిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యకు సంకేతం కావచ్చు.

ఈ లక్షణాలు ఉంటే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే
ఎవరైతే ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడతారో సరిగ్గా భోజనం చేయరు. కడుపులో వికారం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. కొన్ని కొన్ని సార్లు వాంతులు అవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. విపరీతంగా కాళ్ల వాపులు వస్తాయి. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల శరీర అవయవాలలో నీరు చేరి కాళ్లు , పాదాలు వాపుకు గురవుతాయి. ఈ లక్షణాలు కూడా ఫ్యాటీ లివర్ తోనే వస్తాయి.

శరీరంలో ఈ మార్పులు ఫ్యాటీ లివర్ సంకేతాలు
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారి మూత్రం రంగు మారుతుంది. తరచుగా మూత్రం పసుపు రంగులో కనిపిస్తే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే కడుపుకు దిగువ భాగంలో భరించలేని విధంగా నొప్పి ఉంటుంది. ఎవరైతే ఈ నొప్పితో బాధపడతారో వారు వైద్యుడిని సంప్రదించాలి. తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇక చర్మసమస్యలు, కాళ్లు, చేతుల సమస్యలు, నొప్పులు ఉంటే కూడా ఫ్యాటీ లివర్ సమస్య అయ్యే అవకాశం లేకపోలేదు.

పచ్చకామెర్లు, ఈ సమస్యలు ఫ్యాటీ లివర్ తోనే
కళ్ళు, చర్మం పచ్చ రంగులోకి మారడం, పచ్చకామెర్లు లక్షణాలు కనిపించడం కూడా ఫ్యాటీ లివర్ సంకేతాలు. అంతేకాదు చేతి గోళ్ళు, కాళ్ళ గోళ్ళు రంగు మారడం, గోళ్ళ మీద తెలుపు, పసుపు రంగులో మచ్చలు రావడం, ఒళ్ళు నొప్పులు, నడిచేటప్పుడు అసౌకర్యం కలగడం ఫ్యాటీ లివర్ సమస్యతోనే వచ్చి ఉండవచ్చు. కనుక పైన పేర్కొన్న లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి లివర్ ఆరోగ్యాన్ని కచ్చితంగా చెక్ చేయించుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+