నిద్రలేమికి చెక్ పెట్టే ఈ 5 అలవాట్లు చేసుకోండి.. హాయిగా నిద్రపోండి

చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. రాత్రి నిద్ర పోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా నిద్ర పట్టక తెగ సతమతమవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మంచి సుఖమైన నిద్ర పోవాలంటే కొన్ని చిన్న చిన్న అలవాట్లు చేసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ అలవాటుతో హాయిగా నిద్రపోవచ్చని సూచిస్తున్నారు.

నిద్రనిచ్చే అలవాట్లు
ప్రతి మనిషి రోజుకు 7 గంటల నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. కానీ అటువంటి పరిస్థితి లేక చాలామంది నిద్రలేమి సమస్యతో అవస్థ పడుతున్నారు. ఇక అటువంటివారు నిద్రకు సంబంధించి ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఐదు అలవాట్లు మీకు మంచి ప్రశాంతమైన, సుఖవంతమైన నిద్రను ఇస్తాయి.

Follow these 5 habits to check insomnia and get good Sleep

ఉదయాన్నే లేచి ఇలా చెయ్యండి
ప్రతిరోజు ప్రశాంతమైన నిద్రపోవాలి అనుకునేవారు ఉదయాన్నే నిద్ర లేవాలి. పొద్దున్నే సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం చేయడం వల్ల మన శరీరంలోని కార్టిసాల్ మరియు మెలటోనిన్ లను సమతుల్యం చేయడంలో సూర్య నమస్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫలితంగా మన మెదడు పైన ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన నిద్ర పడుతుంది.

ప్రశాంతంగా నిద్ర పోవాలంటే ఇవి చెయ్యండి
ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు పాటించవలసిన రెండవ అలవాటు రాత్రివేళ భోజనం సమయానుకూలంగా చేయడం. రాత్రివేళ పడుకునే రెండు గంటల ముందు భోజనం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే భోజనం చేసి వెంటనే పడుకుంటే నిద్ర పట్టదు. మంచి నిద్ర పోవాలి అనుకునేవారు మరొక ముఖ్యమైన అలవాటుని చేసుకోవాలి. ప్రతిరోజు నిర్దిష్ట సమయానికి నిద్ర పోవాలనేది నియమంగా పెట్టుకోవాలి. ప్రతిరోజు కచ్చితంగా ఆ సమయానికే నిద్రపోవాలి. మొబైల్ ఫోన్లలో టీవీలలో తలపెట్టకూడదు.

జీవనశైలి ఇలా మార్చుకుంటే నిద్ర లేమి సమస్య ఉండదు
రాత్రిపూట హాయిగా నిద్రపోవాలి అనుకునేవారు టీ, కాఫీలను తక్కువ తాగాలి. కెఫిన్ ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. అంతేకాదు క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ప్రతిరోజు క్రమబద్ధమైన జీవన శైలి ద్వారా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు. నిద్ర పట్టడం లేదని వైద్యుల దగ్గరికి వెళ్లి రకరకాల మందులు వాడే బదులు మీ జీవితంలో ఈ చిన్ని చిన్ని అలవాట్లను అలవర్చుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని చూడండి. హాయిగా నిద్రపోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+