ఎముకల పుష్టి ఈ ఆహారాలతో... నిర్లక్ష్యం చెయ్యొద్దు!
ప్రతి మనిషి శరీరంలోను ఎముకలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మన ఎముకలు దృఢంగా ఉంటేనే మనం దృఢంగా కనిపిస్తాం. వయసు పెరుగుతున్న కొద్ది ఎముకలు బలహీనపడతాయి. శరీరంలో కాల్షియం లెవెల్స్ తగ్గడంతో ఎముకలు పట్టుత్వాన్ని కోల్పోతాయి. ఎప్పుడు దృఢమైన ఎముకలు ఉండాలంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇక ఎముకలు దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
ఎముకలు ధృడంగా ఉండాలంటే ఇలా చెయ్యండి
ఎముకలు దృఢంగా ఉండడం కోసం మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మన జీవనశైలి అలవాట్లు మార్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఎముకలు ఉండాలంటే ఆకుకూరలు కూరగాయలు తినడం మాత్రమే కాకుండా పాలు తాగడం మంచిది. పాలల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలల్లో దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి ఇవి మన ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి.

ఎముకల బలం కోసం ఇవి తినండి
ఎముకలు దృఢంగా ఉండాలంటే మన ఆహారంలో నువ్వులను కూడా ఒక భాగంగా చేసుకోవడం మంచిది. నువ్వులలో పాలకంటే అదనంగా 13% ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల నువ్వులలో 1450 గ్రాముల కాల్షియం ఉంటుంది. అటువంటి నువ్వులను ప్రతిరోజు ఒక గుప్పెడు తింటే మన శరీరానికి కావలసిన క్యాల్షియం లభిస్తుంది. ఇది మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
ఎముకల బలానికి ప్రోటీన్
ఎముకలు దృఢంగా ఉండాలంటే మనకు కావాల్సినంత ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 50% ఎముక ప్రోటీన్ తోనే తయారవుతుంది. చాలామంది తక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం సమస్య వస్తుంది. ఎముకలు బలంగా ఉండడానికి తగినంత ప్రోటీన్ తీసుకుంటే మంచిది. అలాగే ఉడకబెట్టిన గుడ్లు మన ఆహారంలో భాగంగా ఉండేలాగా చూసుకోవాలి. ఉడకబెట్టిన కోడి గుడ్లు కూడా ఎముకల బలానికి బాగా దోహదం చేస్తాయి.
ఎముకల ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్
అంతేకాదు ఎముకలు బలంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ ని కూడా మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. కనుక మనం దృఢంగా ఉండాలంటే మన ఎముకలు పుష్టిగా ఉండాలి. ఎముకలు పుష్టిగా ఉండాలంటే తీసుకునే ఆహారంలోనూ పైన పేర్కొన్న వాటిని తీసుకుంటే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications