అల్లం శృంగార జీవితానికి బెల్లం!

అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసినప్పటికీ చాలామంది అల్లం తినడానికి ఇష్టపడరు. అల్లం లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ప్రతిరోజు తప్పకుండా డైట్ లో అల్లాన్ని చేర్చుకుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో దంపతులలో తగ్గిపోతున్న సెక్స్ సామర్థ్యానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. సెక్స్ జీవితాన్ని సంతోషంగా గడపలేకపోతున్న దంపతులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

అల్లంతో సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది
పురుషులలోనూ స్త్రీలలోను అల్లం సంతాన ఉత్పత్తిని పెంచుతుంది. ఇక ఈ విషయాన్ని అనేక అధ్యయనాలు ధృవీకరించాయి. అల్లం వాడడం వల్ల పురుషులలో వీర్య కణాల ఉత్పత్తి, చలన శీలత మెరుగుపడుతుంది. ఫలితంగా వీర్యం నాణ్యత పై సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు అల్లం మనిషి శరీరంలో కొలెస్ట్రాల్ ని తగ్గించి, రక్తంలో కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.

Ginger increases sex capability along with huge health benefits

లైంగిక ఉద్రేకాన్ని పెంచే అల్లం
అల్లం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది మనుషులలో లైంగిక ప్రేరేపణలను ఉత్తేజితం చేయడానికి దోహదం చేస్తుంది. అల్లం రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది. రక్తనాళాలలో రక్తం మెరుగైన రక్తప్రసరణకు తోడ్పడుతుంది. అల్లం మనుషులలో లైంగిక ఉద్రేకాన్ని పెంచుతుంది. లూటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడంలో అల్లం కీలక భూమిక పోషిస్తుంది.

టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే అల్లం
వృషణాలలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం ద్వారా అల్లం టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పురుషుల మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కీళ్ళను బలోపేతం చేస్తాయి. అన్నిటికంటే శృంగార ఉద్దీపనలు కలిగిస్తాయి.

అల్లం దంపతుల శృంగార జీవితానికి బెల్లం
ఒక క్రమ పద్ధతిలో అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే అల్లాన్ని కూడా తగినంత మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. అలా అని అతిగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అల్లంలో ఉన్న గొప్ప గుణాలను తెలుసుకొని తదనగుణంగా ఆహారంలో భాగంగా తీసుకుంటే అల్లం దంపతులు శృంగార జీవితాన్ని తియ్యగా మార్చే బెల్లం అని చెప్పాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+