hair care: ఒక్క నెలలోనే నల్లని, ఒత్తైన, నడుము పొడవు జుట్టు: సూపర్ చిట్కా!!

చాలామంది ఆరోగ్యంగా జుట్టు పెరగడం లేదని తెగ బాధపడుతూ ఉంటారు. జుట్టును పెంచడం కోసం రకరకాల హెయిర్ మాస్క్ లను ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ ను కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయినప్పటికీ జుట్టు ఎక్కువగా పెరగదు. అటువంటివారు ఒక ఆకుతో అద్భుతమైన ప్రయోజనాన్ని పొందవచ్చని చెపుతున్నారు. మనకు దొరికే ఈ ఆకు జుట్టు ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

ఇంతకు ఆ ఆకు ఏమిటి? దాని విశేషాలు ఏమిటి? తెలుసుకుందాం. మునగాకు.. పచ్చి ఆకులను రోజు పడుకునే ముందు తింటే ఒక నెల రోజుల్లోనే జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుందని చెబుతున్నారు. మునగాకులో జుట్టుకు కావలసిన పోషకాలు ఉంటాయని, ఇది విటమిన్లు ఏ,బి,సి బయోటిన్, ఐరన్ మరియు అమైనో ఆమ్లాలు కలిగి ఉంటుందని జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.

hair care: super tip for dark, thick, waist-length hair in just one month

దీనివల్ల కొలాజిన్ ఉత్పత్తి జరుగుతుందని చెబుతున్నారు. మునగాకులు పేస్ట్ లా చేసి జుట్టుకు రాసుకుంటే తలలో రక్త ప్రసరణ మెరుగవుతుందని చెబుతున్నారు . అంతేకాదు జుట్టుకు మునగాకు మాస్క్ ను తయారు చేసుకోలేకపోతే ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆకులను తినాలని దీనివల్ల జుట్టు నల్లగా, అందంగా పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఈ ఆకులను నమలడం వల్ల చర్మం మెరిసిపోయి, మచ్చలు లేకుండా తయారవుతుందని చర్మసౌందర్యాన్ని మెరుగు పరుస్తుందని చెబుతున్నారు.

జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చాలా బాగా పనిచేస్తుందని, మునగ ఆకులను నమలి తినడం వల్ల జుట్టు రాలడం నిరోధించబడుతుందని చెబుతున్నారు. అయితే క్రమం తప్పకుండా దీనిని వాడాలని అంటున్నారు. మునగాకులు కెరాటిన్ ను ఉత్పత్తి చేస్తాయని ఇది జుట్టు పెరుగుదలకు మంచిదని చెబుతున్నారు.

మునగాకులను పేస్టులా తయారుచేసి దీనిని ముఖ్యమైన నూనెతో కలిపి తలకు రాసుకుంటే జుట్టు మృదువుగా, నల్లగా, మందంగా మారుతుందని మార్కెట్లో దొరికే రకరకాల నూనెలను ప్రయోగం చేసే బదులు మునగాకుతో ఒక నెల రోజులపాటు జుట్టు ఆరోగ్యం కోసం ఈ ప్రయోగాన్ని చేసి చూడాలని చెబుతున్నారు. అయితే మునగాకు పెట్టిన రెండు మూడు రోజుల్లోనే మన జుట్టుకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది తెలిసిపోతుంది. ఒకవేళ దానివల్ల ఇతరత్రా వేరే ఇబ్బందులు వస్తే మునగాకులు వాడకుండా ఉండడమే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+