Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయాల్సిందే!

జుట్టు రాలే సమస్య ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య. ఒక మనిషి అందాన్ని ఇనుమడింపజేసేది జుట్టు. జుట్టు లేకపోతే ఎంత అందంగా ఉన్న మనిషి అయినా అందవిహీనంగా కనిపిస్తారు. అంతేకాదు జుట్టు ఆరోగ్యం సదరు మనిషి ఆరోగ్యాన్ని కూడా స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతుంది. ఇప్పుడు వేసవి కాలంలో చాలామంది జుట్టు రాలిపోతుందని తెగ బాధపడుతున్నారు.

ఈ నీళ్ళతో జుట్టు బలోపేతం
అటువంటివారు జుట్టు రాలకుండా దృఢంగా ఆరోగ్యంగా పెరగడం కోసం కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిది. ఆ చిట్కాల విషయానికి వస్తే బియ్యం కడిగిన నీళ్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. బియ్యం కడిగిన నీళ్లలో జుట్టు కోసం కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

Hair fall controls with these natural remedies please try for healthy hair

దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది
ఉల్లిపాయ రసాన్ని తలకు అప్లై చేయడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయ రసం జుట్టుకుదురులను బలోపేతం చేస్తుంది. దీనిలో జుట్టుకి కావలసిన పోషకాలు మెండుగా ఉండడం వల్ల ఇది కొత్త జుట్టు వచ్చేలాగా కూడా చేస్తుంది.

ఇది అప్లై చేస్తే ,మంచి ఫలితం
జుట్టు రాలుతున్న సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు కలబంద గుజ్జును జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కలబంద గుజ్జును జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడంతో పాటు, జుట్టును బలంగా ఆరోగ్యంగా పెరిగేలా చేయవచ్చు.

జుట్టు రాలటం తగ్గాలంటే ఇలా చెయ్యాలి
మెంతులు కూడా జుట్టు రాలే సమస్యకు ఒక మంచి పరిష్కారంగా చెప్పవచ్చు. మెంతులను రాత్రి నీళ్లలో నానబెట్టి తెల్లవారుజామున దానిని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసుకుని గంట తర్వాత తలస్నానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. కుదుళ్లకు బలం పెరుగుతుంది.

ఇది వాడి చూడండి.. జుట్టు ఆరోగ్యం
జుట్టు రాలే సమస్య తగ్గాలని, జుట్టు ఆరోగ్యంగా పెరగాలని కోరుకునేవారు బెండకాయలను మెత్తగా దంచి, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని బియ్యం వేసి, అందులో కొద్దిగా నీరు వేసి ఉడకబెట్టి చిక్కగా అయిన ఆ రసాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని అందులో కొబ్బరి నూనె కానీ ఆల్మండ్ నూనె కానీ కలిపి తలకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ చిట్కాలు ఎవరైతే పాటిస్తారో వారికి జుట్టు రాలే సమస్య నుంచి కొంతమేర ఉపశమనం తప్పక లభిస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+