చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగుతున్నారా?
ఉదయం ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం మనలో చాలామందికి రోజును ప్రారంభించే సాధారణ అలవాటు. ఇది మనల్ని ఉత్సాహంగా ఉంచి, మెదడును చురుకుగా ఉంచుతుంది. కాంతమందికి బ్లాక్ కాఫీ, టీ తాగడం అలవాటు. బ్లాక్ కాఫీ, ముఖ్యంగా చక్కెర లేకుండా తాగడం, ఆరోగ్యంపై అనేక పాజిటివ్ ప్రభావాలు చూపుతుంది.
ఇది కేవలం ఒక రుచికరమైన పానీయం మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందించడంతో పాటు, జీవక్రియను వేగవంతం చేసి, మానసిక , శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

1.బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
బ్లాక్ కాఫీ తక్కువ కాలరీల ఆహారం. కేఫైన్ శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది, ఫ్యాట్ బర్నింగ్‌ను వేగవంతం చేస్తుంది. ఇది తక్షణ శక్తిని అందించి వర్క్‌అవుట‌్‌లకు ఉత్తేజం ఇస్తుంది. దీనిలోని కెఫిన్ జీవక్రియను పెంచి, శరీరంలో కొవ్వు కాలిపోయేలా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
2. మానసిక ఆరోగ్యానికి మేలు
బ్లాక్ కాఫీ తాగడం ద్వారా మానసిక స్పష్టత పెరుగుతుంది. కేఫైన్ నరాల పనితీరును మెరుగుపరచి మూడ్‌ను ఉత్తేజపరుస్తుంది. ఇది డిప్రెషన్ తగ్గించే గుణాలున్న ఆహారంగా పరిగణించబడుతుంది. ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీ మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఇది మన మెదడును చురుకుగా ఉంచి, శారీరక శక్తిని పెంచుతుంది. ఇది అల్జీమర్స్ మరియు పార్కిన్సన్ వ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది.
3. లివర్ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది
పరిశోధనల ప్రకారం, చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగడం లివర్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది లివర్ సమస్యలు, ఫ్యాటీ లివర్, హెపటైటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
4. అధిక యాంటీఆక్సిడెంట్లు
బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలించి శరీర కణాలను రక్షిస్తాయి. ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

5. టైప్ 2 మధుమేహానికి రక్షణ
బ్లాక్ కాఫీ, చక్కెర లేకుండా తీసుకోవడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించే ఆహారంగా పరిగణించబడుతుంది.
6. శరీర డిటాక్సిఫికేషన్
బ్లాక్ కాఫీ మూత్ర నిష్క్రమణను ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
7. హృదయ ఆరోగ్యానికి సహాయం
చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగడం, రక్తనాళాలలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జాగ్రత్తలు:
ఎక్కువ పరిమాణంలో బ్లాక్ కాఫీ తాగడం నిద్రలేమి మరియు ఆందోళనకు దారితీస్తుంది. రోజుకు 1-2 కప్పుల వరకు మాత్రమే తీసుకోవడం మంచిది. ఖాళీ కడుపుతో తీసుకోవడం గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుంది. మునుపటి బ్లాక్ కాఫీని మీ ఆహారంలో చేర్చడం ద్వారా శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను అనుభవించవచ్చు. అయితే, అధికంగా కాఫీ తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గర్భవతులు మరియు చిన్న పిల్లలు కాఫీని తక్కువ మొత్తంలో మాత్రమే తాగాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, కాఫీ తాగే ముందు డాక్టర్‌ను సంప్రదించండి.












Click it and Unblock the Notifications