చియా సీడ్స్ ... చేస్తాయి హెల్త్ మిరాకిల్స్!
ఆరోగ్యంగా జీవించాలి అనుకునే వారికి ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిల్లో చియా గింజలు ఒకటి. చియా సీడ్స్ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. చియా సీడ్స్ లో ఉండే ఫైబర్, ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి ఇవి మన ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా మన బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
చియా సీడ్స్ తో హెల్త్ బెనిఫిట్స్
సహజంగా చియా సీడ్స్ ను సలాడ్స్ లోనూ, స్మూతీలలోను వేసుకుని చాలామంది తింటూ ఉంటారు. అయితే చియా సీడ్స్ ను నీళ్లలో నానబెట్టి ఖాళీ కడుపుతో ఉదయంపూట తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. చియా సీడ్స్ లో అధికంగా డైటరీఫైబర్ ఉంటుంది. ఇది తినడం వల్ల మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. గుండె జబ్బులను తగ్గించడంలోనూ, ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించడంలోనూ చియా సీడ్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయి.

చియా సీడ్స్ తో చెడు కొలెస్ట్రాల్ కు చెక్
చియా సీడ్స్ తో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చియా సీడ్స్ కండరాల పెరుగుదలకు ఎంతో దోహదం చేస్తాయి. చియా సీడ్స్ తో మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు అధిక మొత్తంలో అందుతాయి. వీటిని తింటే రోజంతా యాక్టివ్ గా ఉంటారు. చియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనల్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. చియా సీడ్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డామేజ్ నుండి మనల్ని రక్షిస్తాయి.
క్యాన్సర్ రాకుండా పోరాడే చియా సీడ్స్
చియా సీడ్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడేలా చేస్తాయి. క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా కాపాడడానికి కూడా దోహదం చేస్తాయి. చియా సీడ్స్ లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. చియా సీడ్స్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించి మన ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తాయి.
షుగర్ కు చెక్ పెట్టే చియా సీడ్స్
చియా సీడ్స్ లో ఉండే పొటాషియం, మెగ్నీషియం ఎముకలను బలోపేతం చేస్తాయి. చియా సీడ్స్ రక్తంలో షుగర్ లెవల్స్ ను బాగా తగ్గిస్తాయి. చియా సీడ్స్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం, క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకోవడం ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది.












Click it and Unblock the Notifications