టీతోపాటు రస్క్ లు తింటున్నారా?
ప్రస్తుత రోజుల్లో ఉదయం లేచింది మొదలు గొంతులో ఒక్క చుక్కైనా టీ పడందే పనిని మొదలుపెట్టనివారే అందరూ. ఉదయం నుంచి రాత్రిలోగా రోజుకు 5 నుంచి 10 సార్లు టీ తాగే మహానుభావులు కూడా ఉన్నారు. కొందరు టీతోపాటు బిస్కెట్లు, స్నాక్స్ కలిపి తీసుకుంటుంటారు. అయితే రస్క్ లు మాత్రం మంచివి కాదు. టీ కాంబినేషన్ తో వీటిని తీసుకోవడం ఎంతమాత్రం ఆరోగ్యకరం కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. టీతో పాటు రస్క్ తీసుకుంటే ఎటువంటి నష్టాలో తెలుసుకుందాం.
బాగా శుద్ధి చేసిన పండి నూనెతో రస్క్ లు తయారుచేస్తారు. ప్రతిరోజు వీటిని తినడం అనారోగ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బ్రెడ్ కన్నా రస్కులే ఎక్కువ క్యాలరీలను కలిగివుంటాయి. రస్క్ అనేది కేవలం డీహైడ్రేటెడ్ బ్రెడ్. దీనిలో నుంచి తేమను పూర్తిగా తొలగిస్తే అది రస్క్ కింద మారుతుంది. పంచదారను కలపడంవల్ల రుచిగా ఉంటుంది. రస్క్ లు మిగిలిపోయిన బ్రెడ్ తో తయారుచేస్తారని చాలామందికి తెలియదు. రస్కుల తయారీలో వాడే నూనె కూడా మంచిది కాదు. దీనివల్ల అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఈ నూనె శరీరంలో ఎక్కువగా చేరడంవల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతోపాటు గుండెపోటు కూడా వస్తుంది. గుండె సమస్యలతోపాటు షుగరు వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతోపాటు చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతాయి. రస్క్ లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఫుడ్ ఎడిటింగ్ ప్రిజర్వేటివ్స్ కలపడంవల్ల తొందరగా లావవుతారు. టీతో కలిపి అస్సలు తీసుకోవద్దు అని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications