దానిమ్మ పండులో దాగున్న ఆరోగ్య రహస్యాలు!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. డబ్బు ఉన్న లేకపోయినా ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా అవసరం. అటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వటంలో పండ్లు కీలకపాత్ర పోషిస్తాయి. చాలా రకాల పండ్లు మన శరీరానికి మేలు చేస్తూ మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అటువంటి పండ్లలో దానిమ్మ పండ్లు ఒకటి. దానిమ్మ పండ్లు మనకు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

దానిమ్మ పండులో ఫుల్ పోషకాలు
ఎర్రని గింజలతో చూడగానే తినాలనిపించేలా కనిపించే దానిమ్మ పండులో ఉండే పోషకాల విషయానికి వస్తే ఇందులో 4.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 234 క్యాలరీలు, 3.3 గ్రాముల కొవ్వు 11.3 గ్రాముల ఫైబర్, 52 గ్రాముల కార్బోహైడ్రేట్స్, తోపాటు విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం ,ఫోలేట్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి .

Health secrets hidden in pomegranate fruit

దానిమ్మ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
దానిమ్మ పండులో ఉండే తక్కువ క్యాలరీలు మన బరువును నియంత్రిస్తాయి . ఇందులో ఉండే పీచు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఇక దానిమ్మ పండుని తింటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అని చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యలను దానిమ్మ పండ్లు దూరం చేస్తాయి.

దానిమ్మ పండ్లతో గుండె ఆరోగ్యం
దానిమ్మ పండులో ఉండే పాలీ ఫినోలిక్ గుణాలు మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దానిమ్మ రసం తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గుతుందని కూడా చెబుతారు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు దానిమ్మ పండును తింటే కిడ్నీలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం పొందుతారు.

ఈ సమస్యల నుండి రక్షణ
ఇక దానిమ్మ పండుతో మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు దానిమ్మలో ఉండే పోషకాల కారణంగా శరీరంలో వాపులు తగ్గుతాయి. దానిమ్మ పళ్ళు మన మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. దానిమ్మ పండు తింటే ఆల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులు నయమవుతాయి. అంతేకాదు దానిమ్మ పండుతో జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. బోలెడన్ని పోషక విలువలు ఉన్న దానిమ్మ పండును తినడం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అనేక ఇతరత్రా అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+