health tips: బరువు తగ్గటానికి అడ్డంకిగా 6తప్పులు.. మీరు చేస్తున్నారా? దిద్దుకోండి!!
బరువు తగ్గాలని భావించేవారు ప్రతిరోజు వ్యాయామం చేసి, డైటింగ్ చేసినప్పటికీ అనుకున్నంతగా బరువు తగ్గడం లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. అయితే అలాంటివారు సహజంగా ఆరు తప్పులను తమకు తెలియకుండానే చేస్తూ ఉంటారు. ఈ ఆరు తప్పులు బరువు తగ్గడానికి అడ్డంకిగా మారుతున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అదేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
బరువు తగ్గాలని భావించేవారు డైటింగ్ పేరుతో ఎక్కువ గంటల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కడుపును మాడ్చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ సేపు డైటింగ్ చేయడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. అది శరీరంలో కొవ్వును పేరుకు పోయేలా చేస్తుంది. అందుకే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువసేపు కడుపుని మాడ్చటం వల్ల కూడా అది మన బరువుపై ప్రభావాన్ని చూపిస్తుంది.
బరువు తగ్గాలని భావించేవారు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు కానీ వంటనూనెల గురించి పట్టించుకోరు. వంట నూనెల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే అది మన బరువును మరింత పెంచుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా నూనె ఎంత వాడుతున్నాము? ఏ నూనె వాడుతున్నాము? అనేది చూసుకోవాలి.

బరువు తగ్గాలని భావించేవారు వ్యాయామం చేయకపోయినా దాని ప్రభావం వారిపై కచ్చితంగా ఉంటుంది. బరువు తగ్గాలని భావించేవారు కొంతమంది డైటింగ్ చేస్తున్నామని వ్యాయామం మానేస్తుంటారు. లేదా వ్యాయామాన్ని అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అటువంటివారు ఎక్కువగా బరువు తగ్గరు. అందుకే క్రమ పద్దతిలో ఖచ్చితంగా వ్యాయామం చెయ్యాలి.

అంతేకాదు కొంతమంది ఎక్కువగా వ్యాయామం చేస్తూ సరిగ్గా విశ్రాంతి తీసుకోరు. ఎక్కువ వ్యాయామం చేస్తే త్వరగా తగ్గుతామని భావిస్తూ వారు అనవసరపు వ్యాయామం చేస్తారు. దీనివల్ల వారు ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడి వల్ల బరువు పెరుగుతుంది. కనుక అధికంగా వ్యాయామం చేసిన వారు బరువు తగ్గక పోవడానికి కారణం ఇదే.
చాలా మంది మార్కెట్ లో ప్రచారంలో ఉన్న రకరకాల డైట్ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటారు. దీనివల్ల కూడా నష్టం తప్ప లాభం ఉండదు. ఆరోగ్యకరమైన పద్దతిలో బరువు తగ్గాలి కానీ ఆహారం తీసుకోకుండా రోజుకో ప్రయోగం శరీరంపై చేస్తూ ఉంటే బరువు తగ్గక పోగా అది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారు ఆహారంపై శ్రద్ధ పెట్టాలి కానీ కొందరు మరీ తినే ఆహారంలో క్యాలరీలను చూసుకుంటూ తింటారు. అటువంటి వారు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కనుక వారు ఎక్కువ బరువు తగ్గే అవకాశం ఉండదు. ఏదైనా అతిగా చేసినా, అస్సలే చెయ్యకపోయినా రిజల్ట్స్ బాగా రావు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications