బరువు తగ్గి స్లిమ్ గా చేసే అద్భుతమైన కాఫీ.. టేస్ట్ చెయ్యండి!!
చాలామంది కాఫీ ని ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే కాఫీ టీలు ఎక్కువ తాగడం మూలంగా బరువు పెరుగుతారని చెబుతారు. కానీ కొన్ని స్పెషల్ కాఫీలు మాత్రం మీ బరువును ఇట్టే తగ్గిస్తాయి. ఒబేసిటీ నుండి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాయి. మరి ఆ స్పెషల్ కాఫీలు ఏంటి? వాటిని ఎలా తయారు చేసుకోవాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
జాజికాయ పొడి కాఫీ
కాఫీని తయారు చేసుకునేటప్పుడు ఆ కాఫీలో జాజికాయ పొడి కలుపుకొని మరిగించి తాగితే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. జాజికాయ మంచి మసాలా దినుసు. దీంట్లో మాంగనీస్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మంచి డైటరీ ఫైబర్ కలిగి ఉండడం కారణంగా వేగంగా బరువు తగ్గడంలో కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. జాజికాయ పొడిని కాఫీలో కలుపుకుని తాగడం కచ్చితంగా బరువును తగ్గిస్తుంది.

కాఫీలో ఇవి కలిపి తాగితే బరువు తగ్గుతారు
అంతే కాదు కాఫీలో వెన్న కానీ పచ్చి కొబ్బరి నూనె కానీ వేసుకుని ప్రతిరోజు తీసుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గుతుంది. ఇక డార్క్ చాక్లెట్ లో కూడా బరువును తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ప్రతిరోజు తాగే కాఫీలో డార్క్ చాక్లెట్ ని జోడించడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
దాల్చిన చెక్క పొడితో కాఫీ .. కొవ్వు కరుగుతుంది
డార్క్ చాక్లెట్లకు ఆకలిని తగ్గించే గుణం ఉంటుంది. డార్క్ చాక్లెట్ యాంటీ ఆక్సిడెంట్ల గొప్ప మూలకంగా పనిచేస్తుంది. దీనిలో కెఫిన్, డార్క్ చాక్లెట్ ఉండడం వల్ల ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు కాఫీలో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసుకొని మరిగించి తాగడం వల్ల కూడా ఇది బరువు తగ్గడానికి బాగా దోహదం చేస్తుంది.
కాఫీ డికాక్షన్ లో నిమ్మరసం .. ఊహించని ఫలితం
ఇది శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. ఇది ధమనులను తెరుచుకునేలా చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రతిరోజు కాఫీలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకుని తాగితే మంచిది. అంతేకాదు బరువు తగ్గాలని భావించేవారు ఒక కప్పు కాఫీ డికాషన్ లో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తేనె జోడించి తాగినట్లయితే కూడా బరువు బాగా తగ్గేందుకు ఇది దోహదం చేస్తుంది.
అయితే బరువు తగ్గించే ఈ కాఫీలను ఇలాగే తీసుకోండి
కనుక కాఫీ తాగాలనుకునేవారు ఈ ప్రత్యేకమైన కాఫీలను తయారు చేసుకొని తాగి ఈజీగా బరువు తగ్గండి. అయితే మోతాదుకు మించి ఎక్కువసార్లు కాఫీ తాగకుండా ఉంటే మంచిది. రోజుకు ఒకసారి ఇలా ఈ ప్రత్యేకమైన కాఫీలలో ఏదో ఒకటి చేసుకుని తాగితే తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications