health tips: చిన్నవయసులోనే కళ్ళు మసకబారుతున్నాయా? కళ్ళ ఆరోగ్యం కోసం ఇవి తప్పక తినండి!!
శరీరంలో అన్ని ఇంద్రియాలలో ముఖ్యమైన ఇంద్రియం కళ్ళు. కళ్లు లేకపోతే మనం ఈ ప్రపంచాన్ని చూడలేం. ఏ పనీ చేయలేం.. కాబట్టి కళ్ళ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల కాలంలో మన జీవనశైలి విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే చాలా మందికి కళ్ళు సమస్యలు వస్తున్నాయి. కళ్ళు మసకబారడం, కళ్లు కనిపించకపోవడం వంటి సమస్యలతో అనేకమంది ఇబ్బంది పడుతున్నారు.
కంటి వైద్యుల వద్దకు వెళ్లి కళ్లజోళ్లు ఆశ్రయిస్తున్న వారు రోజురోజుకూ పెరుగుతున్నారు.చిన్న వయసులోనే విపరీతమైన సైట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు . అందుకే కళ్ళ విషయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే, సంరక్షణ కోసం మంచి సమతుల ఆహారం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు వైద్యులు, న్యూట్రిషనిస్టులు.

కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఆరు బాదం పప్పులను నీళ్ళల్లో నాన పెట్టుకొని తినాలని సూచిస్తున్నారు. బాదం పప్పు లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిచూపు మెరుగయ్యేలా చేస్తాయి. కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
కళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఉసిరికాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. ఉసిరికాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రతి రోజూ ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్ కలుపుకొని తాగితే కళ్ళకు రక్షణ కల్పించిన వాళ్లమవుతాం. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో కళ్ల ఆరోగ్యం మెరుగు పడుతుందని చెబుతున్నారు.
పచ్చి కూరగాయలలో కెరటోనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కళ్ళ కు మేలు చేస్తాయని చెబుతున్నారు. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలను ఎక్కువగా తినాలి. చేపలు ఎక్కువగా తినడం వల్ల కళ్లు పొడిబారే సమస్య తగ్గుతుంది.
కళ్ళ ఆరోగ్యం కోసం క్యారెట్, క్యారెట్ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తాయి. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ, బీటా కెరోటిన్ కళ్లకూ మేలు చేస్తాయి. ఇది కంటి చూపు పెరగడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే బొప్పాయి, నారింజ, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లను ఎక్కువగా తినడం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications