health tips: ఆర్థరైటిస్ బాధితులు ఆరోగ్యం కోసం ఈ ఆహారాలకు నో చెప్పండి!!
భారతదేశంలో ఆర్థరైటిస్ అనేది ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. సమాజంలో చాలామంది ఇప్పుడు ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చెడు జీవన శైలి కారణంగా ఈరోజు యువత కూడా చాలామంది ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, బరువు పెరగడం, డయాబెటిస్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉండడం వంటి అనేక కారణాలు ఎంతో మందిని ఆర్థరైటిస్ రోగులుగా మారుస్తున్నాయి.
ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఆహారాల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తినకూడని ఆహార పదార్థాలు తింటే వారు మరింత అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఏం తినకూడదు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ఆహారంలో తీపి పదార్థాలను తగ్గించాలి. ముఖ్యంగా ఆర్థరైటిస్ బాధితులు చక్కెరను తీసుకోకూడదు.

స్వీట్లు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్ లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థరైటిస్ బాధితులు చెక్కెర వినియోగాన్ని తగ్గించాలి. ఆర్థరైటిస్ తో బాధపడేవారు ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారాలలో చెక్కెరలు, ప్రిజర్వేటివ్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నొప్పులను, మంటను పెంచుతాయి. ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల ఊబకాయం పెరుగుతుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. బరువు పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు కూడా పెరుగుతాయి. ఆర్థరైటిస్ తో బాధపడేవారు మద్యానికి దూరంగా ఉండాలి. ఆర్థరైటిస్ రోగులకు ఆల్కాహాల్ తీసుకోవడం కచ్చితంగా నిషేధించబడింది. ఆల్కహాల్ వల్ల వీరికి నష్టం జరుగుతుంది.
ఆర్థరైటిస్ బాధితులు ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోకూడదు. ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది. ఆర్థరైటిస్ బాధితులు ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ ను కూడా తినకూడదు . రెడ్ మీట్ కూడా ఆర్థరైటిస్ రోగులకు ప్రమాదకరమని అధ్యయనం తేల్చింది. కొన్ని రకాల ఎడిబుల్ ఆయిల్స్ కూడా శరీరంలో కీళ్ళ నొప్పుల సమస్యను పెంచుతుంది. కనుక ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఏమి తినకూడదో తెలుసుకుని వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications